Rana | పాములు, అలిగేటర్ కూడా తిన్నా.. తన ఫుడ్ హ్యాబిట్స్‌పై షాకింగ్ విషయాలు చెప్పిన రానా

Rana |  టాలీవుడ్‌లో భిన్నమైన పాత్రలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకున్న రానా ద‌గ్గుబాటి తాజాగా తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉండే రానా, ఒక ఇంటర్వ్యూలో తనకు ఉన్న నాన్-వెజ్ ఫుడ్ పట్ల ఇష్టాన్ని గురించి మాట్లాడారు.

  • By: Sandeep |    movies |    Published on : May 27, 2026 8:40 AM IST
Rana | పాములు, అలిగేటర్ కూడా తిన్నా.. తన ఫుడ్ హ్యాబిట్స్‌పై షాకింగ్ విషయాలు చెప్పిన రానా

Rana |  టాలీవుడ్‌లో భిన్నమైన పాత్రలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకున్న రానా ద‌గ్గుబాటి తాజాగా తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉండే రానా, ఒక ఇంటర్వ్యూలో తనకు ఉన్న నాన్-వెజ్ ఫుడ్ పట్ల ఇష్టాన్ని గురించి మాట్లాడారు.

తాను పూర్తిగా మాంసాహార ప్రియుడినని చెబుతూ, ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానిక వంటకాలను తప్పకుండా రుచి చూస్తానని తెలిపారు. “నేను ఫుల్ మీట్ ఈటర్‌ను. ఏ దేశానికి వెళ్లినా అక్కడి లోకల్ ఫుడ్ తప్పకుండా ట్రై చేస్తాను. చాలా మంది భయపడే కొన్ని వంటకాలు కూడా నేను తిన్నాను. పాములు, అలిగేటర్ కూడా తిన్నాను” అని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

హైద‌రాబాద్ బిర్యానీ చాలా స్పెషల్..

అయితే తనకు అత్యంత ఇష్టమైన ఆహారాల్లో హైదరాబాద్ బిర్యానీ, సీఫుడ్ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని కూడా రానా వెల్లడించారు.

అలాగే కెరీర్‌లో కొన్ని పాత్రల కోసం తాను చేసిన త్యాగాల గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడులో ఒక కీలక పాత్ర కోసం తాను బరువు తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అందుకోసం దాదాపు మూడు నెలల పాటు పూర్తిగా వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యానని వెల్లడించారు.

నాన్ వెజ్ ఆహారానికి దూరంగా..

అలాగే ఘాజి సినిమా సమయంలో కూడా నాన్-వెజ్ ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. షూటింగ్ పూర్తయిన తర్వాత నాంపల్లిలోని తన స్నేహితుడి రెస్టారెంట్ నుంచి హలీం తెప్పించుకుని తిన్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, “చాలా రోజుల తర్వాత ఇష్టమైన ఫుడ్ తినడంతో భావోద్వేగానికి గురయ్యాను” అని చెప్పారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, రానా ప్రస్తుతం విశ్వంభ‌ర లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త కథలు, ప్రాజెక్ట్‌లతో బిజీగా కొనసాగుతున్నారు. రానా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆయన ఫుడ్ ఛాయిస్‌లపై అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.