Raashii Khanna | షూటింగ్ సెట్లో ఊహించ‌ని అనుభ‌వం.. రాశీ ఖన్నా కారవాన్‌లో చోరీ, డ్రైవర్‌పై అనుమానం

Raashii Khanna | సినిమా షూటింగ్‌లలో భద్రతా లోపాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి రాశీ ఖన్నాకు ఓ సినిమా షూటింగ్ సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారవాన్‌లోకి చొరబడిన వ్యక్తి, పర్స్‌లో ఉన్న రూ.50 వేల నగదును దొంగిలించిన ఘటన కలకలం రేపింది.

Raashii Khanna | సినిమా షూటింగ్‌లలో భద్రతా లోపాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి రాశీ ఖన్నాకు ఓ సినిమా షూటింగ్ సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారవాన్‌లోకి చొరబడిన వ్యక్తి, పర్స్‌లో ఉన్న రూ.50 వేల నగదును దొంగిలించిన ఘటన కలకలం రేపింది.

ఎలా జరిగింది?

షూటింగ్‌లో భాగంగా రాశీ ఖన్నా కొద్దిసేపు కారవాన్‌ను వదిలి బయటకు వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. తిరిగి వచ్చాక పర్స్‌లో డబ్బులు లేకపోవడంతో విషయం బయటపడింది. వెంటనే ఆమె మేనేజర్‌కు సమాచారం ఇవ్వగా, యూనిట్ సభ్యులందరినీ అప్రమత్తం చేశారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన చిత్రబృందం, వెంటనే షూటింగ్ సెట్‌ను తాత్కాలికంగా లాక్ చేసి లోపల ఉన్న వారిని విచారించింది. ఎవరు ఈ పని చేశారో గుర్తించే ప‌నిలో ప‌డ్డారు.

డ్రైవర్‌పై అనుమానం

తదుపరి విచారణలో కారవాన్ డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ, అతన్ని ప్రశ్నించగా చివరికి అతడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు బయటపడింది. దీంతో వెంటనే అతడిని పని నుంచి తొలగించి, సంబంధిత కారవాన్ సంస్థకు సమాచారం అందించారు.

దొంగతనం చేసిన నగదును తిరిగి రికవర్ చేసి రాశీ ఖన్నాకు అప్పగించారు. దీంతో పెద్ద నష్టం తప్పినప్పటికీ, ఈ ఘటన యూనిట్ సభ్యుల్లో ఆందోళనకు దారితీసింది.

పరిశ్రమలో చర్చ

ఇలాంటి సంఘటనలు షూటింగ్ సెట్లలో భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. సాధారణంగా నటీమణులు పెద్ద మొత్తంలో నగదు వెంట తీసుకురారని, కానీ ఆ రోజు ప్రత్యేక అవసరం కారణంగా రాశీ ఖన్నా డబ్బు తీసుకువచ్చినట్లు సమాచారం.

కెరీర్ విషయాలు

ఇటీవల రాశీ ఖన్నా నటించిన సినిమాలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. ఆమె నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. అయితే బాలీవుడ్‌లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్న చిత్రంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్లతో కలిసి నటిస్తోంది. మరోవైపు, ఆమె నటించిన వెబ్ సిరీస్ ల‌క్కీ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8న స్ట్రీమింగ్ కానుంది.

Latest News