కొడుకు పరీక్షకు సెలవు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం
కొడుకు పరీక్ష కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దేవరకొండొ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది
విధాత : కొడుకు పరీక్ష కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దేవరకొండొ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. దేవరకొండ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న శంకర్ తన కుమారుడికి ఆదివారం రోజు పరీక్ష ఉందని, తనకు సెలవు కావాలని అడగగా డీఎం రాజీవ్‌ప్రేమ్‌కుమార్ నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ తన చావుకు వీరే కారణమంటూ విడుదల చసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram