Rashmi | ట్రోలింగ్‌పై రష్మీ గౌతమ్ గట్టి కౌంటర్.. జంతు హింసే నా టార్గెట్, రాజకీయాలు కాదు…
Rashmi | స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. జంతు ప్రేమికురాలిగా తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరుస్తూ ఎప్పటికప్పుడు చర్చలలో నిలుస్తున్న ఆమె, తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఘాటుగా స్పందించారు. ఇటీవల వైకాపా నేత ప్రదీప్ చింత చేసిన విమర్శల నేపథ్యంలో, రష్మీ తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై వివరణ ఇచ్చారు.
Rashmi | స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. జంతు ప్రేమికురాలిగా తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరుస్తూ ఎప్పటికప్పుడు చర్చలలో నిలుస్తున్న ఆమె, తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఘాటుగా స్పందించారు. ఇటీవల వైకాపా నేత ప్రదీప్ చింత చేసిన విమర్శల నేపథ్యంలో, రష్మీ తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై వివరణ ఇచ్చారు. తాను ఏ మతానికీ, ఏ రాజకీయ పార్టీకీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఆమె, కేవలం జంతువులపై జరుగుతున్న క్రూరత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని వెల్లడించారు.
నేను ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడను. జంతువులపై జరుగుతున్న హింసను మాత్రమే ఎత్తిచూపుతాను. దానిని మతం లేదా రాజకీయాలతో కలపడం సరైంది కాదు అని రష్మీ తెలిపారు. పండుగల సమయంలో జరిగే జంతుబలులు, గజమాల వేయడం పేరుతో ఏనుగులకు జరిగే ఇబ్బందులు వంటి అంశాలపై తాను గతంలోనూ పలుమార్లు స్పందించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ సమయంలో తనపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, వెనక్కి తగ్గలేదని చెప్పారు. కొందరు తనను దేశద్రోహిగా కూడా ముద్రవేశారని, అయినా తన అభిప్రాయాలను మార్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ధోరణిపై కూడా రష్మీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సమస్యను పరిష్కరించడం మానేసి, దాన్ని మరొక సమస్యతో పోల్చుతూ చర్చను దారి మళ్లించడం జరుగుతోంది. కానీ జంతువులపై జరుగుతున్న అమానవీయ చర్యలను ఆపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అని ఆమె విమర్శించారు. రాజకీయాల విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూ, జంతు సంక్షేమం కోసం నిజాయితీగా పని చేసే ఏ పార్టీ అయినా తనకు మద్దతుగా ఉంటుందని రష్మీ వెల్లడించారు. పార్టీలు, వ్యక్తులు కాదని, ఆలోచనలే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రోలింగ్‌పై తాను భయపడనని, భవిష్యత్తులో కూడా జంతువుల హక్కుల కోసం తన పోరాటం కొనసాగిస్తానని రష్మీ గట్టి సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎదురయ్యే విమర్శలు తనను ఆపలేవని, తన లక్ష్యం జంతువుల సంక్షేమమేనని మరోసారి స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram