Revanth Reddy | ఆర్టీసీ బస్సులో వెళ్లి మ‌రీ ఆ సినిమా చూసిన సీఎం .. మూవీ చూశాక ఆస‌క్తిక‌ర కామెంట్స్

Revanth Reddy |తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సింప్లిసిటీకి ప్రతీకగా నిలిచారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన, తన క్యాబినెట్ సహచరులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు సీఎం బస్సులో బయలుదేరడం అందరి దృష్టిని ఆకర్షించింది.

  • By: sn |    movies |    Published on : Jan 06, 2026 8:02 AM IST
Revanth Reddy | ఆర్టీసీ బస్సులో వెళ్లి మ‌రీ ఆ సినిమా చూసిన సీఎం .. మూవీ చూశాక ఆస‌క్తిక‌ర కామెంట్స్

Revanth Reddy |తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సింప్లిసిటీకి ప్రతీకగా నిలిచారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన, తన క్యాబినెట్ సహచరులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు సీఎం బస్సులో బయలుదేరడం అందరి దృష్టిని ఆకర్షించింది.శాసనసభ ప్రాంగణం నుంచి ప్రసాద్ ల్యాబ్స్ వరకు జరిగిన ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సాధారణంగా వీవీఐపీ కాన్వాయ్‌లకు అలవాటుపడిన వీరు రెగ్యుల‌ర్‌కి భిన్నంగా సామాన్యుల మాదిరిగా బ‌స్సులో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. ప్రయాణంలో సీఎం సహా ప్రజాప్రతినిధులంతా ఒకే ఆర్టీసీ బస్సులో ఉన్నారు. సీఎం సహచరులతో సరదాగా ముచ్చటిస్తూ, సాదాసీదా వాతావరణంలో ప్ర‌యాణం కొన‌సాగించారు. అయితే భద్రతా దృష్ట్యా మార్గమధ్యలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీబాయి పూలే జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించిన ‘పూలే’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించారు. పూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి పాత్రలో పత్రలేఖ పాల్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. మహిళా విద్య, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే దంపతులు చేసిన పోరాటాన్ని ఈ సినిమా భావోద్వేగంగా ఆవిష్కరించింది. హిందీ భాషలో రూపొందిన ఈ చిత్రం 2025 ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్, కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రాన్ని సామాజిక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వీక్షించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సినిమా పూర్తైన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పూలే దంపతుల సేవలను స్మరిస్తూ, వారి ఆలోచనలు నేటి తరానికి ఎంత అవసరమో వ్యాఖ్యానించారు. సామాజిక మార్పుకు సినిమాలు కూడా ఒక శక్తివంతమైన మాధ్యమమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.