Roja | స్టార్ హీరో కోడలిగా వెళ్లనున్న రోజా కూతురు.. ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందంటూ కామెంట్
Roja | మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Roja | మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రోజా అత్యంత యాక్టివ్‌గా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు, టీవీ డిబేట్స్, సభలతో రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచారు.
అయితే 2024 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత రోజా రాజకీయ వివాదాలపై పెద్దగా స్పందించడం తగ్గించారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా రోజా కూతురు అన్షు మాలిక (Anshu Malika) గురించి వస్తున్న వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అన్షు మాలిక త్వరలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టబోతుందని, అంతేకాదు ఓ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలు అభిమానులు, నెటిజన్లలో ఆసక్తిని రేపాయి.
ఈ నేపథ్యంలో నటి రోజా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన రోజా, తన కూతురి పెళ్లి లేదా సినీ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా తెలిపారు.
‘ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి’
స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందన్న ప్రశ్న అడిగిన వెంటనే రోజా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
“ఇప్పటివరకు అలాంటి వార్తలు అయితే నేను వినలేదు. అసలు ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి” అంటూ నవ్వుతూ స్పందించారు. అన్షు మాలిక గురించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వచ్చాయని రోజా వెల్లడించారు. ఆమె యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లిందని, హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరిగిందని తెలిపారు. కానీ వాస్తవానికి అన్షు చదువుల కోసమే అమెరికాకు వెళ్లిందని రోజా స్పష్టం చేశారు.
అన్షు లక్ష్యం సైంటిస్ట్ కావడమే
తన కూతురు లక్ష్యం సైంటిస్ట్ కావడమేనని రోజా తెలిపారు. చదువులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన అన్షు అకాడమిక్స్‌లో ముందుండడమే కాకుండా, ఇటీవల ఇటాలియన్ భాషను కూడా నేర్చుకున్నట్లు చెప్పారు. చదువుతో పాటు సోషల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటూ, పేద పిల్లల చదువులకు సహాయం చేస్తోందని గర్వంగా వెల్లడించారు.
యాక్టింగ్‌పై రోజా అభిప్రాయం
భవిష్యత్తులో అన్షు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రోజా అన్నారు.“యాక్టింగ్ అనేది ఒక వరం. అది అందరికీ దొరకదు. తనకు నిజంగా ఆసక్తి ఉంటే నేను కచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను” అని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం అన్షు చదువులకే ప్రాధాన్యం ఇస్తోందని, కెరీర్ విషయంలో పూర్తిగా ఆమె ఇష్టానికే వదిలేశామని స్పష్టం చేశారు.
పిల్లల విషయంలో ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు
తన పిల్లలను ఎప్పుడూ వాళ్ల ఇష్టానుసారంగానే పెంచానని రోజా భావోద్వేగంగా చెప్పారు. “నా కోరికలను వాళ్లపై ఎప్పుడూ రుద్దలేదు. వాళ్లకు ఏం నచ్చుతుందో అది వాళ్లే నిర్ణయించుకుంటారు. మనం గైడెన్స్‌గా ఉంటే చాలు” అని అన్నారు. మొత్తంగా చూస్తే, అన్షు మాలికపై వస్తున్న సినీ ఎంట్రీ, పెళ్లి రూమర్స్ అన్నీ కేవలం ఊహాగానాలేనని, వాస్తవానికి ఆమె లక్ష్యం సైన్స్ రంగంలోనే ముందుకు వెళ్లడమని రోజా స్పష్టంగా చెప్పినట్లైంది. దీంతో అన్షు మాలికపై నెలకొన్న గాసిప్స్‌కు రోజా ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram