Sara Tendulkar | బాలీవుడ్ హీరోయిన్‌కి తీసిపోని సారా టెండూల్కర్ .. గ్లామర్‌కు దూరంగా ఉన్నా ఆకట్టుకున్న సింపుల్ ఎలిగెన్స్

Sara Tendulkar | సారా టెండూల్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తెగా మాత్రమే కాకుండా, తనదైన స్టైల్‌, గ్రేస్‌తో ఇప్పటికే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, ఆత్మవిశ్వాసం పరంగా ఆమె ఏ బాలీవుడ్ హీరోయిన్‌కూ తీసిపోదని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటివరకు సారా వెండితెరపై అడుగుపెట్టలేదు.

  • By: sn |    movies |    Published on : Jan 07, 2026 7:57 AM IST
Sara Tendulkar | బాలీవుడ్ హీరోయిన్‌కి తీసిపోని సారా టెండూల్కర్ .. గ్లామర్‌కు దూరంగా ఉన్నా ఆకట్టుకున్న సింపుల్ ఎలిగెన్స్

Sara Tendulkar | సారా టెండూల్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తెగా మాత్రమే కాకుండా, తనదైన స్టైల్‌, గ్రేస్‌తో ఇప్పటికే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, ఆత్మవిశ్వాసం పరంగా ఆమె ఏ బాలీవుడ్ హీరోయిన్‌కూ తీసిపోదని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటివరకు సారా వెండితెరపై అడుగుపెట్టలేదు. అయినా సోషల్ మీడియాలోనూ, పబ్లిక్ ఈవెంట్లలోనూ ఆమె హాజరు ప్రతిసారి ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.జనవరి 5న ముంబైలోని ఆంటిలియాలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యునైటెడ్ ఇన్ ట్రయంఫ్’ ఈవెంట్‌కు సారా హాజరై ప్రత్యేకంగా నిలిచింది. నీతా అంబానీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళల అంధుల క్రికెట్ జట్ల నుంచి భారత ప్రపంచకప్ ఛాంపియన్లను సత్కరించారు. క్రీడా స్ఫూర్తిని సెలబ్రేషన్స్‌తో మేళవించిన ఈ వేడుకలో అనేక ప్రముఖులు పాల్గొన్నారు.

ఈవెంట్‌లో ఒకవైపు క్రీడాకారుల విజయోత్సాహం ప్రేక్షకులను ఆకట్టుకుంటే, మరోవైపు రెడ్ కార్పెట్‌పై సెలబ్రిటీల సందడి ప్రత్యేకంగా కనిపించింది. ముఖ్యంగా సారా టెండూల్కర్, జాన్వీ కపూర్ ఇద్దరూ షో స్టాపర్స్‌గా నిలిచారు. జాన్వీ కపూర్ ఎప్పటిలాగే బోల్డ్ అండ్ గ్లామరస్ లుక్‌తో కనిపించగా, మియు మియు డిజైన్ చేసిన ఎరుపు పూల మినీ డ్రెస్‌లో ఆమె స్టైల్ చర్చనీయాంశమైంది. అయితే, గ్లామర్‌కు భిన్నంగా సారా టెండూల్కర్ సింపుల్ అయినా ఎంతో ఎలిగెంట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తన తల్లిదండ్రులు సచిన్, అంజలి టెండూల్కర్‌లతో కలిసి హాజరైన సారా పొడవాటి నల్లటి మ్యాక్సీ డ్రెస్‌లో ఎంతో హుందాగా కనిపించింది. చిరునవ్వుతో తన తండ్రి వెంట నడుస్తూ కనిపించిన సారా, గ్రేస్‌కి అసలు అర్థం చెప్పినట్టుగా అనిపించింది.

సినీ పరిశ్రమలో సారాకు ఇప్పటికే మంచి స్నేహితులు ఉన్నారు. వారితో కలిసి పలు బ్రాండ్ ప్రమోషన్స్‌, వాణిజ్య ప్రకటనల్లోనూ ఆమె కనిపించింది. అయినా ఇప్పటివరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకపోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. “సారా ఎప్పుడు వెండితెరపై కనిపిస్తుందా?” అన్న ప్రశ్న సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. ప్రస్తుతం తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న సారా, సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆమె వెండితెర ఆరంగేట్రం ఎప్పుడు జరుగుతుందో తెలియకపోయినా, అభిమానులు మాత్రం సారా టెండూల్కర్‌ను త్వరలోనే హీరోయిన్‌గా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.