Sharwanand | రోహిత్–కోహ్లీ బయోపిక్‌లపై శర్వానంద్ క్లారిటీ.. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌క చేస్తానంటూ కామెంట్

Sharwanand | టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో శర్వానంద్‌కు క్రికెట్ బయోపిక్‌లపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో తన ఫిజిక్‌ను చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్‌కు సరిపోతారని చాలా మంది అభిప్రాయపడ్డారని, అయితే ‘బైకర్’ కోసం ఇప్పుడు స్లిమ్‌గా మారిన తర్వాత చూస్తుంటే విరాట్ కోహ్లీ బయోపిక్‌కు కూడా సెట్ అవుతారని రిపోర్టర్లు వ్యాఖ్యానించారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 23, 2026 11:37 AM IST
Sharwanand | రోహిత్–కోహ్లీ బయోపిక్‌లపై శర్వానంద్ క్లారిటీ.. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌క చేస్తానంటూ కామెంట్

Sharwanand | టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో శర్వానంద్‌కు క్రికెట్ బయోపిక్‌లపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో తన ఫిజిక్‌ను చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్‌కు సరిపోతారని చాలా మంది అభిప్రాయపడ్డారని, అయితే ‘బైకర్’ కోసం ఇప్పుడు స్లిమ్‌గా మారిన తర్వాత చూస్తుంటే విరాట్ కోహ్లీ బయోపిక్‌కు కూడా సెట్ అవుతారని రిపోర్టర్లు వ్యాఖ్యానించారు. దీనిపై శర్వానంద్ స్పందిస్తూ, “రోహిత్ శర్మ బయోపిక్ గురించి చాలా కాలంగా వింటున్నాను. ఆయన కథ నాకు కూడా చాలా ఇష్టం. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తాను” అని చెప్పారు.

రోహిత్ శర్మ జీవిత ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకమని, అలాంటి కథల్లో నటించడం తనకు ఆసక్తికరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కథ డిమాండ్ చేస్తే ఏ స్పోర్ట్స్ స్టార్ బయోపిక్ అయినా చేయడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.ఇక ‘బైకర్’ సినిమా కోసం శర్వానంద్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక రేసర్ పాత్రకు తగిన ఫిట్‌నెస్ సాధించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. కేవలం లుక్ మాత్రమే కాకుండా బైక్ రేసింగ్ నైపుణ్యాలు కూడా నేర్చుకుని పాత్రలో పూర్తిగా మమేకమయ్యారు. ఈ మార్పుతో ఆయన ఫిజిక్ పూర్తిగా మారిపోయిందని, అందుకే కోహ్లీ బయోపిక్‌కు సరిపోతారని వస్తున్న కామెంట్లను ఆయన సరదాగా తీసుకున్నారు.

దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. యాక్షన్‌తో పాటు తండ్రీకొడుకుల భావోద్వేగాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని శర్వానంద్ తెలిపారు. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ భవిష్యత్తులో రోహిత్ శర్మ బయోపిక్ తెరకెక్కితే, అందులో శర్వానంద్ నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బైకర్’ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుండగా, ఈ మూవీ తర్వాత శర్వా నుంచి ఎలాంటి కొత్త ప్రకటన వస్తుందో చూడాలి.