Shivaji Raja | ఆమెకి లవ్ లెటర్ రాస్తే, తీసుకెళ్లి ఏకంగా నా భార్యకి ఇచ్చింది..శివాజీ రాజా స్టన్నింగ్ కామెంట్స్
Shivaji Raja | అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో రూపొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయ సాధించింది.
Shivaji Raja | అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో రూపొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయ సాధించింది. మూవీ విడుదల తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిన్న సినిమా, పెద్ద చిత్రాల సరసన నిలుస్తూ అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో మంచి దూకుడు చూపిస్తోంది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు, దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరై టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంలో నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ, “సంతోషంతో కడుపు నిండిపోతోంది. వర్షం తర్వాత వచ్చే మట్టివాసనలా ఉన్న సినిమా ఇది. వేణు ఊడుగుల ఒక వజ్రాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మా సాయిలు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాడు,” అని అన్నారు. అలాగే అనితా చౌదరి గురించి మాట్లాడిన ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.
లవ్ లెటర్ రాస్తే..
మురారి టైమ్‌లో పశ్చిమ గోదావరి యాసలో అనితకి లవ్ లెటర్ రాశాను. అది ఒకతే చదువుకోవచ్చు కదా, అందరికీ చూపించింది. తర్వాత నా భార్యకు కూడా చూపించి బుక్ చేసింది అని చెప్పడంతో హాల్ మొత్తం గోల చేశారు.ఇక హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, “నేను, వేణు ఊడుగుల కలిసి ‘నీది నాదీ ఒకే కథ’ చేసేటప్పుడు ఎందరో నిర్మాతల దగ్గరకు వెళ్లినా ఎవరూ ఓకే చెప్పలేదు. అందుకే మేమే నిర్మించుకున్నాం. ఆ కోపంతోనే వేణు ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు,” అని నవ్వులు పూయించారు.
వేణు దగ్గర ఎన్నో మంచి కథలు ఉన్నాయి. అవన్నీ తెలుగు సినిమాకి అవసరమే. ఈటీవీ విన్ కొత్త వాళ్లను ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. ప్రేక్షకులు కోరుకునే కొత్త కంటెంట్‌ను తెరకు తీసుకువస్తున్నారు,” అని ప్రశంసించారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇలా సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తుండగా, చిన్న సినిమాల సత్తా ఏంటనేది ఈ చిత్రంతో మరోసారి నిరూపితమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram