Varanasi | వారణాసి ఈవెంట్‌లో మహేష్ ఎంట్రీ సీన్ కోసం ఇంత కష్టపడ్డరా.. వీడియో వైరల్
Varanasi | టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు జక్కన్న తెలపడంతో అంచనాలు మరింత పెరిగాయి.
Varanasi | టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై హైప్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు జక్కన్న తెలపడంతో అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబుని శ్రీరాముడి పాత్రలో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాజమౌళి–మహేష్ బాబు భారీ ప్రాజెక్ట్ వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ ఈవెంట్‌కు వేలాది మంది ఫ్యాన్స్ హాజరై సందడి చేశారు. మహేష్ బాబు ఎద్దుపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అరుదైన విజువల్స్, స్టేజ్ డిజైన్, మొత్తం సెటప్ అంతా కలిసి ఈ ఈవెంట్‌ను ఒక పెద్ద సెలబ్రేషన్‌గానే మార్చేశాయి. అయితే ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వ్యక్తిగతంగా పెట్టిన ఎఫర్ట్. ఆయన ఈవెంట్ కోసం ఎంత కష్టపడడ్డా అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఈ ఈవెంట్ కోసం కొన్ని రోజుల ముందునుంచే రాజమౌళి స్వయంగా ప్రణాళికలు సిద్ధం చేసి, పూజ కార్యక్రమం మొదలైన నాటి నుంచి ప్రతి చిన్న పని వరకూ పర్సనల్‌గా మానిటర్ చేశారని టీమ్ చెబుతోంది. మహేష్ ఎంట్రీకే కాకుండా, స్టేజ్‌పై లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ సౌండ్, స్టేజ్ యొక్క మొత్తం అంబియెన్స్ వరకు రాజమౌళి స్వయంగా తనిఖీ చేశారని తాజాగా విడుదలైన వారణాసి టైటిల్ ఈవెంట్ మేకింగ్ వీడియో ద్వారా తెలుస్తోంది.
ఇందులో మహేష్ ఎంట్రీని రాజమౌళి ముందుగానే చెక్ చేస్తూ, అది ప్రేక్షకుల ముందు ఎలా కనిపిస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సినిమాకే కాదు, ఒక ఈవెంట్‌కైనా ఈ స్థాయి డెడికేషన్ చూపుతున్న రాజమౌళిని చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ మేకింగ్ వీడియోను చూసిన వారు “రాజమౌళి దర్శకుడు మాత్రమే కాకుండా ఒక బ్రాండ్ ఎందుకు అయిపోయారు అనే దానికి ఇదే ప్రూఫ్” అని కామెంట్లు పెడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram