Mahesh Babu | వారణాసి’పై అంచనాలు పీక్స్‌కి.. శ్రీరామనవమి వేళ మహేష్ బాబు స్పెషల్ లుక్ రిలీజ్‌కు సిద్ధం
Mahesh Babu | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతోంది.
Mahesh Babu | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇటీవలే గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల చేసిన వారణాసి గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విజువల్స్, కథా నేపథ్యం, మైథలాజికల్ టచ్ అన్నీ కలసి సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. గ్లింప్స్‌లో కాశీ నుంచి ప్రారంభమై ఆఫ్రికా, అంటార్కిటికా వరకు ప్రయాణించే కథా పరిధిని, అంతేకాదు త్రేతా యుగంతోనూ లింక్ చేసే విధానం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ముఖ్యంగా మహేష్ బాబును నందిపై వస్తున్న శివుడి తరహా ప్రతీకాత్మక రూపంలో చూపించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజువల్స్‌తోనే రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడనే విషయం మరోసారి స్పష్టమైంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో వారణాసి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, విడుదలైన పాట, గ్లింప్స్ ద్వారా సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
తాజాగా మరో కీలక అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ లాంచ్ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో దర్శనమిస్తాడని, ఆ లుక్ చూసినప్పుడు తనకే గూస్‌బంప్స్ వచ్చాయని రాజమౌళి వెల్లడించారు. ఇప్పుడు అదే అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా వారణాసి నుంచి మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న ప్రత్యేక లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే ఈ లుక్‌తో శ్రీరామనవమి వేళ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమాపై ఇప్పటికే ఉన్న హైప్‌ను ఈ స్పెషల్ లుక్ మరింతగా పెంచనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram