Peddi | తెలుగు రాష్ట్రాల్లో ‘చికిరి చికిరి’ మేనియా… టీడీపీ నేతల డ్యాన్స్ వీడియోకి ఫిదా అయిన ద‌ర్శ‌కుడు!

Peddi | ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అద‌ర‌గొడుతుంది. సాంగ్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాట సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.

  • By: sn |    movies |    Published on : Nov 22, 2025 8:28 AM IST
Peddi | తెలుగు రాష్ట్రాల్లో ‘చికిరి చికిరి’ మేనియా… టీడీపీ నేతల డ్యాన్స్ వీడియోకి ఫిదా అయిన ద‌ర్శ‌కుడు!

Peddi | ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అద‌ర‌గొడుతుంది. సాంగ్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాట సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది. యువత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో హుక్ స్టెప్పులను రీక్రియేట్ చేస్తూ వరుసగా వీడియోలు చేస్తుండగా, ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 75 మిలియన్ల వ్యూస్ దాటింది. అందులో ఒక్క తెలుగు వెర్షన్‌కే 51 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

చికిరి చికిరి హంగామా..

ఇక ఈ పాట క్రేజ్ రాజకీయ నాయకులను కూడా ఆకర్షిస్తోంది. కడప జిల్లా రైల్వే కోడూరు టీడీపీ నేత, అలాగే పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ ఈ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఓ కుటుంబ వేడుకకు హాజరైన ఆయన, తన తమ్ముడు, భార్య, బంధువులతో కలిసి ‘చికిరి చికిరి’ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “చాలా రోజులు తర్వాత కుటుంబంతో గడపడం ఆనందంగా ఉంది. సరదాగా చేసిన ‘చికిరీ’ డ్యాన్స్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోప్పడకండి” అంటూ కామెంట్ చేశారు.
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు ఫిదా..

ఇదిలా ఉండగా, ఒక నెటిజన్ ఈ వీడియోను షేర్ చేయగా, అది ‘పెద్ది’ సినిమా దర్శకుడు సానా బుచ్చిబాబు దృష్టికి వెళ్లింది. ఆయన ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రశంసించడం, రామ్ చరణ్ అభిమానులను మరింత ఎగ్జైట్ చేసింది. సోషల్ మీడియాలో “పెద్ది మూవీ మేనియా” అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నరసింహ ప్రసాద్ రాజకీయ నాయకుడే కాదు, నటుడు కూడా. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. అదనంగా ఆయన దివంగత చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు డాక్టర్ శివప్రసాద్ అల్లుడు. శివప్రసాద్ కూడా టాలీవుడ్‌లో పలు ప్రముఖ చిత్రాల్లో నటించారు.

భారీ పాన్‌ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘పెద్ది’ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘చికిరి చికిరి’ పాట ఇప్పటికే ప్రజాదరణను దక్కించుకుంది. ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది.