Tollywood | 2025 క్రిస్మస్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చిన్న చిన్న సినిమాల సందడి… ఏ మూవీకి ఎంత వసూళ్లు?

Tollywood | సినిమా పరిశ్రమలో క్రిస్మస్ సీజన్ ఎప్పుడూ స్పెషల్‌. వరుస సెలవులు ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు. అందుకే ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంటారు. 2025 క్రిస్మస్ సీజన్‌లో కూడా వరుసగా సినిమాలు విడుదలయ్యాయి.

  • By: sn |    movies |    Published on : Dec 26, 2025 4:55 PM IST
Tollywood | 2025 క్రిస్మస్‌కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చిన్న చిన్న సినిమాల సందడి… ఏ మూవీకి ఎంత వసూళ్లు?

Tollywood | సినిమా పరిశ్రమలో క్రిస్మస్ సీజన్ ఎప్పుడూ స్పెషల్‌. వరుస సెలవులు ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు. అందుకే ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంటారు. 2025 క్రిస్మస్ సీజన్‌లో కూడా వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈసారి లిస్ట్‌లో స్టార్ హీరోల భారీ చిత్రాలు లేకపోవడంతో, చిన్న సినిమాలే పండుగ చేసుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఈ క్రిస్మస్‌కు దండోరా, ఛాంపియన్, ఈషా, శంబాలా అనే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి వీటికి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా నమోదయ్యాయి? ఓసారి వివరంగా చూద్దాం.

ఛాంపియన్ – రోషన్ మేక కెరీర్ బెస్ట్ ఓపెనింగ్

యంగ్ హీరో రోషన్ మేక నటించిన ఛాంపియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. కొత్త దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాను రూపొందించాడు. కథ పాతదైనా, స్క్రీన్‌పై నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా తొలి రోజే దాదాపు రూ.4.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి క్రిస్మస్ విన్నర్‌గా నిలిచింది.

శంబాలా – ఆది సాయికుమార్‌కు సూపర్ హిట్ ఊరట

చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్‌కు శంబాలా రూపంలో మంచి బ్రేక్ దక్కింది. సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కథ, కథనంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కొత్తదనం ఉన్న కథ కావడంతో థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ డేనే ఈ సినిమా రూ.3 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఈషా – హారర్ లవర్స్‌కు పండుగ

ఈ క్రిస్మస్ సీజన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీ ఈషా. గ్రిప్పింగ్ కథనం, భయపెట్టే సీన్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లో వచ్చిన పక్కా హారర్ మూవీ కావడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ఈషా సినిమా సుమారు రూ.2.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

దండోరా – మిక్స్‌డ్ టాక్‌తో పరిమిత వసూళ్లు

దండోరా సినిమా కొంతమంది ప్రేక్షకులను మెప్పించినా, చాలామందికి రొటీన్‌గా అనిపించింది. దాంతో థియేటర్లలో ఆసక్తి కాస్త తగ్గింది. ఫలితంగా ఈ సినిమా తొలి రోజు దాదాపు రూ.1 కోటి వరకు రెవెన్యూ సాధించినట్లు సమాచారం.

మొత్తం మీద…పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా, 2025 క్రిస్మస్ సీజన్‌లో విడుదలైన చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన ఓపెనింగ్స్ నమోదు చేశాయి. ముఖ్యంగా ఛాంపియన్ మరియు శంబాలా సినిమాలు ట్రేడ్‌ను సర్ప్రైజ్ చేయగా, ఈషా హారర్ జానర్‌లో మంచి మార్కులు కొట్టేసింది. క్రిస్మస్ సీజన్ చిన్న సినిమాలకు నిజంగానే పండుగగా మారిందని చెప్పుకోవచ్చు