Titles | టాలీవుడ్‌లో టైటిల్ టెన్షన్.. స్టార్ హీరోల కొత్త సినిమాల పేర్లపై ఫ్యాన్స్ అసంతృప్తి

Titles |సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేది టైటిల్. అందుకే కథకు సరిపోయేలా, క్యాచీగా, గుర్తుండిపోయేలా పేర్లు పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల కొత్త సినిమాల టైటిల్స్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల వర్కింగ్ టైటిల్స్, లీక్ అయిన పేర్లు అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.

  • By: Sandeep |    movies |    Published on : Apr 28, 2026 12:39 PM IST
Titles | టాలీవుడ్‌లో టైటిల్ టెన్షన్.. స్టార్ హీరోల కొత్త సినిమాల పేర్లపై ఫ్యాన్స్ అసంతృప్తి

Titles |సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేది టైటిల్. అందుకే కథకు సరిపోయేలా, క్యాచీగా, గుర్తుండిపోయేలా పేర్లు పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల కొత్త సినిమాల టైటిల్స్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల వర్కింగ్ టైటిల్స్, లీక్ అయిన పేర్లు అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల ఒక సినిమా టైటిల్ కారణంగానే కొంతమంది ప్రేక్షకులు దూరమయ్యారని దర్శకుడు గుణశేఖర్ వ్యాఖ్యానించడంతో, టైటిల్ ప్రాముఖ్యత మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోల తాజా ప్రాజెక్టుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

వెరైటీ టైటిల్స్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్న చిత్రానికి ప్రస్తుతం ‘మెగా 158’, ‘చిరు బాబీ 2’ వంటి వర్కింగ్ టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి ‘కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు బయటకు రావడంతో ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ పేరు మాస్ అపీల్‌కు సరిపోదని భావిస్తూ, ‘వాల్తేరు వీరయ్య’ తరహాలో పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాలని కోరుతున్నారు.

ఇక కింగ్ నాగార్జున తన 100వ చిత్రంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ను ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే దీనికి ‘లాటరీ కింగ్’ అనే పేరు ప్రచారంలోకి రావడంతో అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ‘లాటరీ’ అనే పదం ట్రోలింగ్‌కు ఉపయోగపడుతుందని, అలాంటి టైటిల్ హీరో ఇమేజ్‌కు సరిపోదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ‘కింగ్ 100’నే ఫైనల్ టైటిల్‌గా ఉంచాలని సూచిస్తున్నారు.

మాస్ ఇమేజ్‌కి స‌రిపోవు..

మాస్ మహారాజా రవితేజ కూడా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలూ బాగున్నారా!’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పేరు మాస్ ఇమేజ్‌కు సరిపోదని రవితేజ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. క్యాచీగా, ఎనర్జీతో నిండిన టైటిల్ ఉండాలని వారు కోరుతున్నారు.

ఇలా అధికారిక ప్రకటనలు రాకముందే టైటిల్స్‌పై అభిమానులు స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తమ హీరోలకు పవర్‌ఫుల్ టైటిల్స్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుంటే, మరోవైపు కంటెంట్ బలంగా ఉంటే టైటిల్ ఎలా ఉన్నా సినిమా హిట్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో టైటిల్ ఎంపిక కూడా ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది. తుది నిర్ణయం ఏమవుతుందో చూడాలి.