Varanasi | వారణాసి బడ్జెట్ లీక్ చేసిన ప్రియాంక చోప్రా.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్
Varanasi | దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.
Varanasi | దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా ఎక్కువ వివరాలు బయటకు రాకపోయినా, ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందన్న ప్రచారం మొదటి నుంచే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక సమాచారం బయటకు రావడంతో సినీ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. ఇటీవల ‘ది కపిల్ శర్మ షో సీజన్ 4’లో పాల్గొన్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎక్కడా వెల్లడించని ఒక సంచలన విషయాన్ని చెప్పింది.
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని ఏకంగా రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం. అంతేకాదు, రాజమౌళి కెరీర్‌లో కూడా ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల జాబితాలో ఈ చిత్రం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం పార్ట్ 1’ ఉంది. ఆ సినిమా రూ. 2,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే, రాజమౌళి – మహేష్ సినిమా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్నందున, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సులు, ప్రొడక్షన్ విలువల్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘వారణాసి’ చిత్రాన్ని అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. ఇందులో మహేష్ బాబు ఇప్పటివరకు కనిపించని పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ అనుభవం ఉన్న ప్రియాంక ఈ ప్రాజెక్ట్‌కు గ్లోబల్ రేంజ్ తీసుకురానుందని అభిమానులు భావిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాల్లో రూపొందుతోంది. రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ ప్రాణం పోసే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించగా, సంభాషణలను దేవా కట్టా రాస్తున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని, షూటింగ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్లు, విదేశీ లొకేషన్లను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే, రాజమౌళి- మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా భారతీయ సినీ పరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారనుందని స్పష్టంగా కనిపిస్తోంది. రూ. 1,300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram