Warangal: కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది

Warangal: విధాత, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందనీ, 15 నెలల్లో ఏ వర్గానికి కాంగ్రెస్ మేలు చేయలేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు ఏప్రిల్, మే చివరి వరకు పండుతాయి.. కావున అప్పటి వరకు నీళ్లు ఇవ్వాలి.. కేసీఆర్ ఎర్రటి ఎండల్లో సైతం సాగునీరు అందించారనీ వివరించారు. పర్సంటేజీల కోసం కక్కుర్తి, మెయింటెనెన్స్ లేకనే దేవాదుల నీరందడం లేదు… జిల్లా కు కరువు వచ్చింది.. ఎండిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సారెస్పీ నీరును కూడా మార్చి వరకే షెడ్యూల్ ఉంది.. ఇలా అయితే జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పంట ఎండి పోయే ప్రమాదం ఉంది. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులేదే బాధ్యత అని పేర్కొన్నారు.
దేవాదుల మూడో దశ పనులు 95 శాతం బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యిందినీ, మీరచ్చి సున్నాలేసి, మోటార్లు ఆన్ చేసుడే ఉండే… కానీ అది సక్కగ చేయలేదు… అయిన ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏడాది క్రితం ప్రారంభించాల్సిన దేవాదులను ఇప్పటి వరకు ప్రారంభించకుండా రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సమృద్దిగా నీటి నిల్వలుంటే నీరు లేదని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. దేవాదుల మెయింటెనెన్స్ కి ప్రతీ ఏటా 7 కోట్లు ఖర్చు అవుతుంది..కాంట్రాక్టర్ 20% కమీషన్ ఇవ్వనన్నందుకు బిల్లులు విడుదల చేయలేదు.
సదరు కాంట్రాక్టర్ వాళ్ల టీమ్ సమ్మె చేస్తేనే నేడు ఈ దుస్థితి.. దేవాదుల పాపం కచ్చితంగా కాంగ్రెస్‌దేనని విమర్శించారు. త్వరలో దేవాదుల పంప్ హౌజ్ పర్యటనను మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో కలిసి చేపడతామని చెప్పారు. కడియం పార్టీలు మారడంపై దృష్టి పెట్టిండని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పార్టీ నియోజకవర్గ కన్వినర్ తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినికాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, సీనియర్ నాయకులు సల్వాజీ రవీందర్ రావు, నయీమొద్దీన్, బండి రజినీకుమార్, నాయకులు చాగంటి రమేష్, పోలపెల్లి రామ్మూర్తి, ఖలీల్, శ్రీకాంత్ చారి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.