Vijay | తమిళ రాజకీయాల్లో కొత్త ట్రెండ్.. సంప్రదాయానికి భిన్నంగా సీఎం విజయ్ డ్రెస్ స్టైల్, సీక్రెట్ ఏంటి?

Vijay | తమిళనాడులో రాజకీయ నాయకుల డ్రెస్ కోడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించడం అక్కడి రాజకీయ సంస్కృతిలో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు దాదాపు అందరూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

Vijay | తమిళనాడులో రాజకీయ నాయకుల డ్రెస్ కోడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించడం అక్కడి రాజకీయ సంస్కృతిలో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు దాదాపు అందరూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు.కామ‌రాజు నుంచి అన్నాదురై, ప‌ళ‌నిస్వామి, స్టాలిన్ వరకు తెల్ల పంచె, తెల్ల చొక్కా డ్రెస్‌కోడ్‌ను పాటిస్తూ వచ్చారు. తమిళనాడులో రాజకీయ నాయకత్వానికి ఇది ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

అక్కడ రాజకీయ పార్టీలకే అనుగుణంగా ప్రత్యేక పంచెలు మార్కెట్లో అందుబాటులో ఉండటం విశేషం. డీఎంకే నేతలు ఎరుపు-నలుపు బోర్డర్ ఉన్న పంచెలు ధరిస్తే, అన్నాడీఎంకే నేతలు ఎరుపు, తెలుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఉన్న బోర్డర్ పంచెలు ధరిస్తుంటారు. ప్రతి పార్టీకి సంబంధించిన రంగులతో ప్రత్యేకంగా పంచెలు తయారవుతుంటాయి.

విజ‌య్ డ్రెస్ కోడ్ డిఫ‌రెంట్..

అయితే తాజాగా తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విజ‌య్ ఈ సంప్రదాయ డ్రెస్ కోడ్‌కు పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2026 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన డ్రెస్సింగ్ స్టైల్‌తో కూడా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.

ఎన్నికల ప్రచారం సమయంలోనే విజయ్ లైట్ బ్రౌన్ కలర్ ప్యాంట్, తెల్ల చొక్కాతో కనిపించి చర్చనీయాంశమయ్యారు. ఆ సమయంలో ఆయన లుక్‌ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ్రెస్ స్టైల్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ మరింత స్టైలిష్‌గా నల్ల కోటుతో కొత్త లుక్‌లో కనిపించడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స‌ర్కార్ సినిమాలో ఇదే లుక్‌తో..

ప్రమాణ స్వీకార వేడుకలో విజయ్ ఈ కొత్త డ్రెస్ కోడ్‌లో కనిపించగానే అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇప్పటివరకు తమిళనాడులో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి స్టైల్‌లో కనిపించలేదని, విజయ్ లుక్ యువతకు కొత్త ఫీల్ ఇచ్చిందని అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన డ్రెస్సింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయ్ నటించిన స‌ర్కార్ సినిమాలో కూడా ఆయన ఇలాగే ముఖ్యమంత్రి హోదాలో ఇదే తరహా డ్రెస్ స్టైల్‌లో కనిపించారు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే లుక్‌లో సీఎం కుర్చీలో కనిపించడంతో అభిమానులు ఆ సన్నివేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Latest News