Vijay – Rashmika | ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మిక పెళ్లి .. హల్దీ, సంగీత్, రిసెప్షన్ వివరాలు ఇవే

Vijay - Rashmika | టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి ఊపందుకున్నాయి.

  • By: sn |    movies |    Published on : Feb 20, 2026 12:00 PM IST
Vijay – Rashmika | ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మిక పెళ్లి .. హల్దీ, సంగీత్, రిసెప్షన్ వివరాలు ఇవే

Vijay – Rashmika | టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

హల్దీ, సంగీత్‌తో ప్రారంభం

సమాచారం ప్రకారం ఫిబ్రవరి 24న హల్దీ వేడుక, 25న సంగీత్ కార్యక్రమం జరగనుండగా, ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకలను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ శివార్లలో ఉన్న ఓ హిల్ రిసార్ట్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా లగ్జరీ హోటల్ The Mementos by ITC Hotelsలోనే పెళ్లి జరగవచ్చని బలంగా వినిపిస్తోంది. అద్భుతమైన ప్రకృతి వాతావరణం, ప్రైవసీకి అనుకూలమైన వేదిక కావడంతో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

కేవలం కొద్దిమందికే ఆహ్వానం

ఆడంబరాలకు దూరంగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల మధ్యే ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా ఉండేందుకు కఠినమైన ‘నో-ఫోన్ పాలసీ’ అమలు చేయనున్నారట. అతిథులు మొబైల్ ఫోన్లు వేదికలోకి తీసుకురాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

పెళ్లి వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించినా, రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. 2026 మార్చి 4న హైదరాబాద్‌లో భారీ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు నగరంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ కృష్ణ‌ Taj Krishnaను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది.

ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారని అంచనా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకకు విచ్చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ఈ ఏడాదిలోనే ఇది అతిపెద్ద సెలబ్రిటీ వేడుకగా నిలిచే అవకాశం ఉంది.

ఓటీటీ ఆఫర్‌కు నో

ఇదిలా ఉంటే, ఈ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాన్ని వ్యాపారంగా మార్చకూడదనే నిర్ణయంతో పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచాలనే అభిప్రాయంలో ఉన్నారట.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

ఇప్పటివరకు ఈ వార్తలపై ఈ జంట అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సోషల్ మీడియాలో అభిమానుల సందడి మాత్రం పెరుగుతోంది. పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో త్వరలోనే స్పష్టత రానుంది. నిజమైతే, టాలీవుడ్‌లో మరో స్టార్ వెడ్డింగ్‌కు రంగం సిద్ధమవుతున్నట్టే.