Bigg Boss 9 | తమిళ బిగ్ బాస్ 9లో హింసాత్మక ఘటన.. లేడి కంటెస్టెంట్‌ని కాళ్లతో తన్నడంపై హోస్ట్ ఆగ్రహం
Bigg Boss 9 | తమిళంలో ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవల తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. అక్టోబర్ 5న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తుండగా, షో మొదటి నుంచే మంచి రేటింగ్‌లు సాధిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా కొందరు కంటెస్టెంట్ల ప్రవర్తన కారణంగా షోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Bigg Boss 9 | తమిళంలో ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవల తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. అక్టోబర్ 5న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తుండగా, షో మొదటి నుంచే మంచి రేటింగ్‌లు సాధిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా కొందరు కంటెస్టెంట్ల ప్రవర్తన కారణంగా షోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వచ్చిన పార్వతి, కమ్రుద్దీన్‌ల ఆటతీరు, ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభం నుంచే ఈ ఇద్దరి వ్యవహారం సరిగా లేదని అడియన్స్ ఆరోపణలు చేస్తుండగా, హోస్ట్ విజయ్ సేతుపతి గతంలోనే వారికి హెచ్చరికలు జారీ చేశారు.
అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమపక్షులుగా ఉన్న వీరిద్దరూ ఇటీవల డార్క్ రూంలో గంటకు పైగా గడపడంతో బిగ్ బాస్ స్వయంగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అడియన్స్ మరింతగా మండిపడ్డారు. ఈ వివాదం చల్లారకముందే మరో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. జనవరి 2, 2026న ‘టికెట్ టు ఫినాలే’ కోసం నిర్వహించిన కార్ టాస్క్ సమయంలో కమ్రుద్దీన్, పార్వతి ఇద్దరూ కలిసి లేడీ కంటెస్టెంట్ సాండ్రాపై అమానుషంగా ప్రవర్తించారు. టాస్క్‌లో భాగంగా సాండ్రాను బలవంతంగా కారు నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించగా, మిగతా కంటెస్టెంట్లు అడ్డుకున్నప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు.
కాళ్లతో తన్నుతూ, కొడుతూ ఆమెను బయటకు నెట్టే ప్రయత్నంలో సాండ్రా కారు నుంచి కింద పడిపోయి తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆమెను మెడికల్ రూంకు తరలించడంతో హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి వల్ల ఇతర కంటెస్టెంట్ల ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ విజయ్ సేతుపతి తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. కార్ టాస్క్‌లో మీ ఇద్దరి ప్రవర్తన అసహ్యకరమని మండిపడిన ఆయన, “ఇద్దరూ సంబరాలు మీ ఇంట్లో చేసుకోండి.. మీ ఇంటి సభ్యులు మీకు స్వాగతం పలుకుతున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం కమ్రుద్దీన్, పార్వతి ఇద్దరికీ రెడ్ కార్డ్ ఇచ్చినట్టు ప్రోమోలో చూపించారు. ఈ నిర్ణయంతో అక్కడున్న ప్రేక్షకులు ఆనందంతో గంతులేయగా, అడియన్స్ కూడా సోషల్ మీడియాలో హోస్ట్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. తమిళ బిగ్ బాస్ చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన ఘటనగా మారడంతో, ఈ ఎపిసోడ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram