Vishnu Priya | యూట్యూబర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ.. తప్పుడు ప్రచారంపై సీరియస్ వార్నింగ్

Vishnu Priya | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణుప్రియ భీమినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ షో పోవే పోరా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె, తర్వాత రియాలిటీ షోలు, టెలివిజన్ కార్యక్రమాలతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా కొనసాగుతోంది.

  • By: Sandeep |    movies |    Published on : May 23, 2026 8:33 AM IST
Vishnu Priya | యూట్యూబర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణుప్రియ.. తప్పుడు ప్రచారంపై సీరియస్ వార్నింగ్

Vishnu Priya | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణుప్రియ భీమినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ షో పోవే పోరా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె, తర్వాత రియాలిటీ షోలు, టెలివిజన్ కార్యక్రమాలతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా కొనసాగుతోంది.

ఇటీవల కొన్ని రోజులుగా విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌కు సంబంధించిన అంశం పెద్ద చర్చకు దారితీసింది. సబ్‌స్క్రిప్షన్ ద్వారా షేర్ చేస్తున్న కొన్ని ఫోటోలు, కంటెంట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది నెటిజన్లు విమర్శలు కూడా చేశారు.

పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు..

ఇప్పుడు మరోసారి విష్ణుప్రియ పేరు వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి కారణం సోషల్ మీడియా వివాదం కాదు.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడమే. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ యూట్యూబ్ ఛానల్‌పై ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తనపై ఓ యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారం చేస్తోందని, అసత్య సమాచారంతో వీడియోలు రూపొందిస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని విష్ణుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తాను..

ఈ సందర్భంగా విష్ణుప్రియ స్పందిస్తూ, సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ వేదికగా ఎవరైనా తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వీడియోలు రూపొందించడం, వేధింపులకు పాల్పడటం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం.

ఇక విష్ణుప్రియ కెరీర్ విషయానికి వస్తే, మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టింది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, చెక్‌మేట్ వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం రియాలిటీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. అలాగే బిగ్ బాస్ తెలుగు ద్వారా ఆమెకు మరింత గుర్తింపు లభించింది.

ప్రస్తుతం యాంకరింగ్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్న విష్ణుప్రియ, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.