Vishwak Sen | ‘కల్ట్’ టీజర్‌తో హైప్ పెంచిన విశ్వక్ సేన్.. సంగీత ద‌ర్శ‌కుడికి రూ.30 లక్షల గిఫ్ట్!

Vishwak Sen | మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ Vishwak Sen హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న తాజా చిత్రం క‌ల్ట్‌ ‘Cult’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ వైలెంట్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వక్ డైరెక్షన్‌లో మూడో సినిమా కావడం విశేషం.

Vishwak Sen | మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ Vishwak Sen హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న తాజా చిత్రం క‌ల్ట్‌ ‘Cult’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ వైలెంట్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వక్ డైరెక్షన్‌లో మూడో సినిమా కావడం విశేషం. ఇంతకుముందు ఆయన ఫ‌ల‌క్‌నుమా దాస్, ద‌స్ కా ధ‌మ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.కొంత గ్యాప్ తర్వాత విశ్వక్ మళ్లీ మెగాఫోన్ పట్టడంతో ‘కల్ట్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

టీజర్‌తో పెరిగిన అంచనాలు

తాజాగా విడుదలైన ‘కల్ట్’ టీజర్‌లో వైలెంట్ కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. డార్క్ టోన్, ఇంటెన్స్ విజువల్స్‌తో టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడుతూ, “దాదాపు నాలుగేళ్లుగా ఈ కథను రాస్తున్నాను. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.

రవి బస్రూర్‌కు స్పెషల్ గిఫ్ట్

ఈ సినిమాకు సంభాషణలను దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్ Tharun Bhascker అందించగా, సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ర‌వి బ‌స్రూర్ Ravi Basrur సమకూర్చారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్ అయితే, మరో కన్ను రవి బస్రూర్ గారు. ఆయన మ్యూజిక్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లింది” అని ప్రశంసించారు.

అంతేకాకుండా, కృతజ్ఞతగా రవి బస్రూర్‌కు రోలెక్స్ గోల్డ్ వాచ్‌ను బహుమతిగా అందించారు. ఆ వాచ్ విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం. “ఇది నా ఫేవరెట్ వాచ్. రెండేళ్లు వెయిట్ చేసి తెప్పించుకున్నాను. మళ్లీ నేను సినిమా చేయమంటే ఈ వాచ్ చూసైనా ఓకే చేయాలి సర్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు విశ్వక్. అనంతరం ఆ వాచ్‌ను స్వయంగా రవి బస్రూర్ చేతికి తొడిగి అందరికీ చూపించారు.

బస్రూర్ క్రేజ్ ..

ర‌వి బస్రూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కేజీఎఫ్ 1, స‌లార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. త్వరలో రాబోతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘డ్రాగన్’కూ ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారని సమాచారం. మొత్తానికి ‘కల్ట్’ టీజర్‌తో విశ్వక్ సేన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపించగా, రవి బస్రూర్‌కు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఈ ఈవెంట్‌కు అదనపు హైలైట్‌గా మారింది. సినిమా విడుదలపై ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News