National Film Awards | భగవంత్ కేసరి, హనుమాన్‌కు జాతీయ చలనచిత్ర పురస్కారాలు

 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా మెరిసింది. ‘హనుమాన్’ సినిమాకు యానిమేషన్, యాక్షన్ విభాగాల్లో రెండు అవార్డులు లభించగా, ‘బేబీ’ సినిమాకు స్క్రీన్‌ప్లే, గానం విభాగాల్లో రెండు , ‘బలగం’ పాటకు ఉత్తమ గేయ రచయిత పురస్కారం దక్కాయి. ‘గాంధీతాత చెట్టు’ చిత్రంతో దర్శకుడు సుకుమార్​ కుమార్తె, సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ గుర్తింపు పొందింది.

Reported by: ADHARVA | వినోదం | Aug 01, 2025, 10:30 pm IST
Read Time: 14 mins
National Film Awards | భగవంత్ కేసరి, హనుమాన్‌కు జాతీయ చలనచిత్ర పురస్కారాలు

హైలైట్స్:

  • జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమాల ఘనత
  • మొత్తంగా 7 అవార్డులు తెలుగు చిత్రాల కైవసం
  • బేబీ, బలగం సినిమాలకు కూడా దక్కిన గౌరవం.
  • సుకుమార్​ కూతురు సుకృతికి తొలిచిత్రంలోనే ఉత్తమ బాలనటి అవార్డు
  • షారుఖ్​ఖాన్​, విక్రాంత్​ మాసే జాతీయ ఉత్తమ నటులు, రాణీముఖర్జీ ఉత్తమ నటి

భారతదేశంలో సినిమా రంగం అత్యంత గౌరవప్రదంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది. 71వ ఎడిషన్​ కింద ప్రకటించిన ఈ అవార్డుల్లో సినిమాలు మంచి గుర్తింపు పొందాయి. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి“ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కాగా, విజువల్ ఎఫెక్ట్స్ మరియు యానిమేషన్ విభాగంలో “హనుమాన్“ సినిమా రెండు అవార్డులతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇక తెలుగు దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి తన నటనకు గాను “గాంధీ తాత చెట్టు“ చిత్రంతో ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యింది. ఇది తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. “బలగం“ చిత్రంలోని “ఊరు పల్లెటూరు” పాటకు పాటల రచయిత కాసర్ల శ్యామ్​కు ఉత్తమ గేయ రచయిత అవార్డు లభించింది. “హనుమాన్“ చిత్రానికి స్టంట్స్​కు గాను నందు, పృథ్వి అనే యాక్షన్ కొరియోగ్రాఫర్లు అవార్డు గెలుచుకోవడంతోపాటు, ఉత్తమ విజువల్​ ఎఫెక్ట్స్​ అవార్డు కూడా హనుమాన్​కే దక్కింది.  ఉత్తమ స్క్రీన్​ప్లేకు గాను సాయి రాజేశ్ నీలం, ఉత్తమ గాయకుడుగా పీవీఎన్‌ఎస్ రోహిత్  అవార్డులు బేబీ చిత్రానికి దక్కాయి. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, ఉత్తమ యానిమేషన్ / విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో హనుమాన్​ సత్తా చాటింది.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది – ఈ ఏడాది ఉత్తమ జాతీయ చిత్రంగా విక్రాంత్ మాస్సే నటించిన “12th ఫెయిల్“ నిలిచింది. ఈ సినిమా విద్యారంగంలో పోరాడే ఓ యువకుడి గాథను తేటతెల్లం చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్” సినిమాలోని పాత్రకు, 12th ఫెయిల్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే ఉత్తమ నటులుగా అవార్డును పంచుకోగా జవాన్​ సినిమాలోని పాట “చెలియా..”కి ఉత్తమ మహిళా గాయనిగా శిల్పా రావు ఎంపికయ్యారు. “మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే”లో నటించిన రాణీ ముఖర్జీకి  ఉత్తమ నటి అవార్డు లభించింది.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన “ద కేరళ స్టోరీ“ చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది. మ్యూజిక్ విభాగంలో “వాతి“ సినిమాకు పాటల కోసం జీవీ ప్రకాశ్ కుమార్​కు, “యానిమల్“ సినిమా నేపథ్య సంగీతానికి హర్షవర్ధన్ రామేశ్వర్​కు అవార్డులు లభించాయి.

ప్రత్యేక ప్రస్తావనలు:

  • ఉత్తమ పాపులర్ చిత్రం – “రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని“
  • ఉత్తమ కొరియోగ్రఫీ – “దిండోరా బాజ్ రె” పాటకు వైభవి మర్చంట్
  • ఉత్తమ ఎడిటింగ్ – మిధున్ మురళి (పొక్కలాం)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్ – మోహనదాస్ (“2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో”)

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు: Best Regional Films

  • ఉత్తమ తమిళ చిత్రం – పార్కింగ్
  • ఉత్తమ మరాఠీ చిత్రం – శ్యాంచీ ఆయ్
  • ఉత్తమ మలయాళ చిత్రం – ఉల్లొళు
  • ఉత్తమ హిందీ చిత్రం – కాథల్
  • ఉత్తమ గుజరాతీ చిత్రం – వశ్
  • ఉత్తమ ఒడియా చిత్రం – పుష్కర
  • ఉత్తమ బెంగాలీ చిత్రం – డీప్ ఫ్రిడ్జ్
  • ఉత్తమ అస్సామీ సినిమా – రొంగటపు 1982

నాన్ ఫీచర్ విభాగంలో విజేతలు: Non-Feature film Winners

ఈ విభాగంలో చిన్న స్థాయిలో అయినా బలమైన సందేశాలను ఇచ్చే డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ విభాగంలో “ఫ్లవరింగ్ మ్యాన్” అనే హిందీ చిత్రం ఉత్తమ నాన్-ఫీచర్ ఫిలిం గా ఎంపికైంది. శిల్పిక బోర్డొలాయ్ అనే దర్శకురాలు “మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ“ అనే మిజోరాం చిత్రం ద్వారా ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా నిలిచారు.

చెప్పాలంటే, ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో అన్ని భాషల్లోని సినిమాలు, నటులు, సంగీత దర్శకులు, రచయితలు, బాలనటుల ప్రతిభకు న్యాయం జరగడం చూస్తే భారత సినిమా స్థాయి ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలైన భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ, బలగం, గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలు ఈ అవార్డుల్లో నిలిచిన విధానం తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అవార్డుల పూర్తి వివరాలు:

ఫీచర్ ఫిల్మ్ విభాగం (Feature Films Category)

 ప్రధాన పురస్కారాలు(Main Awards)

  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్ (హిందీ)
  • ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ – ది కేరళ స్టోరీ (హిందీ)
  • ఉత్తమ నటుడు (సహ పంచుకున్నారు):
    • షారుఖ్ ఖాన్ – జవాన్ (హిందీ)
    • విక్రాంత్ మాస్సే – 12th ఫెయిల్ (హిందీ)
  • ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ – మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే (హిందీ)

 సహాయ నటులు (Supporting Characters)

  • ఉత్తమ సహాయ నటుడు:
    • విజయ రాఘవన్ – పూక్కాలం (మలయాళం)
    • ముత్తుపెట్టయ్ సోము భాస్కర్ – పార్కింగ్ (తమిళం)
  • ఉత్తమ సహాయ నటి:
    • ఊర్వశి – ఉల్లొళుక్కు (మలయాళం)
    • జానకీ బోడివాలా – వష్ (గుజరాతీ)

బాల నటులు( Child Artists)

  • సుకృతి వేణి బండ్రెడ్డి – గాంధీతాత చెట్టు (తెలుగు)
  • కబీర్ ఖాండారి – జిప్సీ (మరాఠీ)
  • త్రిష థోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ – నాల్ 2 (మరాఠీ)

సంగీతం & నేపథ్య గానం:(Music – Playback)

  • ఉత్తమ నేపథ్య గాయకుడు: పీవీఎన్‌ఎస్ రోహిత్ – ప్రేమిస్తున్నా (బేబీ – తెలుగు)
  • ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు – చెలియా (జవాన్ – హిందీ)
  • ఉత్తమ సంగీతం – పాటలు: జీవీ ప్రకాశ్ కుమార్ – వాతి (తమిళం)
  • ఉత్తమ సంగీతం – నేపథ్యం: హర్షవర్ధన్ రామేశ్వర్ – యానిమల్ (హిందీ)

రచన & స్క్రీన్‌ప్లే:(Story – Screenplay)

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – ఒరిజినల్:
    • సాయి రాజేశ్ నీలం – బేబీ (తెలుగు)
    • రామ్‌కుమార్ బాలకృష్ణన్ – పార్కింగ్ (తమిళం)
  • ఉత్తమ డైలాగ్ రచయిత: దీపక్ కింగ్రానీ – సిర్ఫ్ ఏక్ బండా కాఫీ హై (హిందీ)
  • ఉత్తమ లిరిక్స్: కాసర్ల శ్యామ్ – ఊరూ పల్లెటూరు పాట (బలగం – తెలుగు)

సాంకేతిక విభాగాలు(Technical departments)

  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ప్రసంతను మొహపాత్ర – ది కేరళ స్టోరీ
  • ఉత్తమ ఎడిటింగ్: మిధున్ మురళి – పూక్కాలం (మలయాళం)
  • ఉత్తమ సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరణ్ మురళీధరన్ – యానిమల్ (హిందీ)
  • ఉత్తమ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ – సామ్ బహదూర్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: సచిన్ లవ్లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ – సామ్ బహదూర్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మోహనదాస్ – 2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో (మలయాళం)

నృత్యం, యాక్షన్, విజువల్​ ఎఫెక్ట్స్​(Choreography, Action, Visual Effects)

  • ఉత్తమ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్ – దిండోరా బాజ్ రె పాట (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ)
  • ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: నందు, పృథ్వి – హనుమాన్ (తెలుగు)
  • ఉత్తమ  విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్ (తెలుగు)

ఇతర పురస్కారాలు:

  • ఉత్తమ బాలల చిత్రం: నాల్ 2 (మరాఠీ)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆశిష్ బెండే – ఆత్మపాంప్లెట్ (మరాఠీ)
  • ఉత్తమ పాపులర్ ఎంటర్టైన్‌మెంట్ చిత్రం: రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ (హిందీ)
  • ఉత్తమ నేషనల్ & సోషల్ వాల్యూస్ చిత్రం: సామ్ బహదూర్

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు (Best Regional Films)

తెలుగు : భగవంత్ కేసరి
తమిళం : పార్కింగ్
మలయాళం : ఉల్లొళుక్కు
మరాఠీ : ష్యాంచీ ఆయ్
గుజరాతీ : వష్
హిందీ : కథల్
ఒడియా : పుష్కర
బెంగాలీ : డీప్ ఫ్రిడ్జ్
అస్సామీ : రొంగటపు 1982
పంజాబీ : గొడ్డే గొడ్డే చా
కన్నడ : కందీలు – ది రే ఆఫ్ హోప్

 

 నాన్–ఫీచర్ ఫిల్మ్స్ విభాగం

  • ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ)
  • ఉత్తమ దర్శకత్వం: పీయూష్ ఠాకూర్ – ది ఫస్ట్ ఫిల్మ్
  • ఉత్తమ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) – చిదానంద నాయక్
  • ఉత్తమ వాయిస్ ఓవర్: హరికృష్ణన్ ఎస్ – ది సేక్రెడ్ జాక్ (ఇంగ్లీష్)
  • ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్: ప్రణీల్ దేశాయ్ – ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
  • ఉత్తమ ఎడిటింగ్: నీలాద్రి రాయ్ – మూవింగ్ ఫోకస్
  • ఉత్తమ సౌండ్ డిజైన్: శుభరుణ్ సేన్‌గుప్తా – దుందగిరి కె ఫూల్ (హిందీ)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్ – లిటిల్ వింగ్స్ (తమిళం)
  • ఉత్తమ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
  • ఉత్తమ బయోగ్రఫికల్ / హిస్టారికల్ ఫిల్మ్:
    • మా బో మా గాన్ (ఒడియా)
    • లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజన్ (ఇంగ్లీష్)
  • ఉత్తమ పరిచయ దర్శకురాలు: శిల్పిక బోర్డొలాయ్ – మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ (మిజోరాం)
  • ఉత్తమ షార్ట్ ఫిల్మ్: గిద్: ద స్కావెంజర్
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: గాడ్, వల్చర్ అండ్ హ్యూమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)
  • ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ (సోషల్ / ఎన్విరాన్‌మెంటల్): ది సైలెంట్ ఎపిడెమిక్ (హిందీ