OTT | ఓటీటీ బిజినెస్‌లో భారీ మార్పులు.. హడలెత్తిపోతున్న హీరోలు, నిర్మాతలు
OTT | కరోనా సమయంలో నిర్మాతలకు ప్రాణరక్షకుల్లాగా వ్యవహరించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు తమ వ్యూహాలను పూర్తిగా మార్చేశాయి. అప్పట్లో కేవలం కాంబినేషన్లు, హీరో–డైరెక్టర్ క్రేజ్, హైప్ ఆధారంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిజిటల్ సంస్థలు, ఇప్పుడు నిర్మాతలకు కఠిన షరతులు విధిస్తున్నాయి.
OTT | కరోనా సమయంలో నిర్మాతలకు ప్రాణరక్షకుల్లాగా వ్యవహరించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు తమ వ్యూహాలను పూర్తిగా మార్చేశాయి. అప్పట్లో కేవలం కాంబినేషన్లు, హీరో–డైరెక్టర్ క్రేజ్, హైప్ ఆధారంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిజిటల్ సంస్థలు, ఇప్పుడు నిర్మాతలకు కఠిన షరతులు విధిస్తున్నాయి.
ఓటిటీల నూతన స్ట్రాటజీ
షూటింగ్ మొదలు పెట్టకముందే సినాప్సిస్, స్క్రిప్ట్ డీటెయిల్స్ అడగడం, రివ్యూలు, కలెక్షన్లు చూసి పోస్ట్-రిలీజ్ ప్రైసింగ్, పే-పర్-వ్యూ మోడల్‌లో ‘ఎంత మంది చూస్తే అంత రేట్’ అనే రెవెన్యూ షేరింగ్ విధానం ప్రవేశపెడుతున్నాయి. ఈ కొత్త విధానాలన్నీ నిర్మాతలకు భారీ భారంగా మారాయి. ఓటిటీ పుణ్యమా అని వచ్చిన భారీ ఆఫర్‌లు ఇప్పుడు చరిత్రతోపాటు ముగుస్తున్నాయి.
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్
తాజాగా నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్లో అధికారికంగా ఆఫీస్ ప్రారంభించటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం… ఇకపై స్టార్ హీరోలు, పెద్ద బ్యానర్లు, హైప్ ఆధారంగా డీల్స్ కుదుర్చే పద్ధతికి నెట్‌ఫ్లిక్స్ గుడ్‌బై చెప్పబోతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా తాము స్వయంగా ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నట్లు సమాచారం.ఇటీవల ఈటీవీ విన్ ‘లిటిల్ హార్ట్స్’తో పెద్ద విజయం సాధించింది. లోకల్ కంటెంట్ , థియేట్రికల్ రిలీస్ , ఓటిటి స్ట్రాటజీ పెద్ద సక్సెస్ ఇచ్చింది. అమెజాన్ కూడా కొన్ని ఒరిజినల్ సినిమాలు నిర్మించినప్పటికీ ఇంకా భారీ హిట్‌ను అందుకోలేదు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదే దారిని అనుసరిస్తోంది.
మరింత క్వాలిటీ కంటెంట్!
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు స్వయంగా కంటెంట్ రూపొందిస్తే నాణ్యత పెరుగుతుంది. బడ్జెట్ కంట్రోల్‌లో ఉంటుంది. ఒరిజినాలిటీ, క్రియేటివిటీకి ప్రాధాన్యం పెరుగుతుంది. హై స్టాండర్డ్ కంటెంట్ ఓటిటిలో లభిస్తే, థియేటర్లకు ఇంకా మంచి సినిమాలు రావలసిందే. దీంతో దర్శకులు, నిర్మాతలు మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది.
స్టార్స్ పారితోషికాలకు కత్తెర?
ఓటిటి ఆఫర్లు తగ్గితే స్టార్ హీరోల పారితోషికం తగ్గే అవకాశముంది. ప్రొడక్షన్ ఖర్చులు కంట్రోల్ అవుతాయి. అనవసరప ఖర్చు తగ్గి ఇండస్ట్రీ హెల్తీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఓటిటి మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు మొదట నిర్మాతలకు కఠినంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇండస్ట్రీకి మంచి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోటీ పెరిగితే, కంటెంట్ నాణ్యత కూడా పెరగడం ఖాయం.భవిష్యత్‌లో ప్రేక్షకులు మరింత క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించే అవకాశం ఉంది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram