Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఓ భారీ డిజాస్టర్ తో పాటు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ అభిమానులను నిరుత్సాహపరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఓజీ’ మూవీ బాక్స్ ఆఫీసుు బద్దలు కొట్టి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!

విధాత, హైదరాబాద్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఓ భారీ డిజాస్టర్ తో పాటు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ అభిమానులను నిరుత్సాహపరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఓజీ’ మూవీ బాక్స్ ఆఫీసుు బద్దలు కొట్టి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ మరో నాలుగు సినిమాలు తన చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఆయన ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే పవన్ తరువాతి ప్రాజెక్ట్ టైటిల్. దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాకు ‘అర్జున’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ టైటిల్ ను దిల్ రాజు ఫిలిం ఛాంబర్ రిజిష్టర్ చేయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న కొత్త చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా, ‘అర్జున’ టైటిల్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించి ‘అర్జున్’ సినిమాను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పవన్ కు సంబంధించిన షెడ్యూల్ పూర్తి కాగా మిగతా నటీనటులకు సంబంధించిన పోర్షన్ మిగిలి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నెలతో ఆ షూటింగ్ కూడా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. దీంతో ఏప్రీల్ లో ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం.