Rukmini Vasanth | కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా రుక్మిణి వసంత్.. 5ఏళ్ల‌లో అన్ని కోట్ల సంపాద‌న‌నా?

Rukmini Vasanth |  కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి దక్షిణాది మొత్తం తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. సప్త సాగరదాచే ఎల్లో సినిమాతో యువత హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు భారీ ప్రాజెక్టులతో బిజీగా మారింది.

Rukmini Vasanth |  కన్నడ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి దక్షిణాది మొత్తం తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. సప్త సాగరదాచే ఎల్లో సినిమాతో యువత హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు భారీ ప్రాజెక్టులతో బిజీగా మారింది.

సైనిక కుటుంబం నుంచి సినీ రంగానికి

రుక్మిణి వసంత్ నేపథ్యం ఎంతో గర్వించదగిన‌ది.. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో సేవలందిస్తూ 2007లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందారు. ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత అశోక చక్ర పురస్కారం ప్రదానం చేసింది. తల్లి సుభాషిణి వసంత్ నుంచి కళలపై ఆసక్తి, తండ్రి నుంచి క్రమశిక్షణను అందిపుచ్చుకున్న రుక్మిణి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది.

కాంతారతో వచ్చిన భారీ బ్రేక్

రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 సినిమాలో ‘కనకవతి’ పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో మెప్పించి, తన నటనలో వైవిధ్యాన్ని నిరూపించింది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారింది.

పెరుగుతున్న డిమాండ్ – పెరిగిన రెమ్యూనరేషన్

ప్రస్తుతం రుక్మిణి వసంత్ నెట్ వర్త్ సుమారు రూ.7 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బెంగళూరులోని కుటుంబ ఆస్తులతో కలిసి 2026 చివరి నాటికి ఆమె సంపద రూ.10 కోట్లకు చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారీ ప్రాజెక్టులతో బిజీ

ప్రస్తుతం రుక్మిణి, యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో ‘మెల్లిసా’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో కూడా ఆమె పేరు వినిపిస్తోంది.

బహుభాషా ప్రయాణం

కేవలం కన్నడకే పరిమితం కాకుండా రుక్మిణి వసంత్ తెలుగు, తమిళ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతితో ‘ఏస్’, శివకార్తికేయన్తో ‘మదరాసి’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రుక్మిణి, భవిష్యత్తులో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లోనూ ఆమె పేరు వినిపిస్తుండటం విశేషం. కేవలం అందంతోనే కాకుండా తన ప్రతిభతో దక్షిణాది సినీ రంగంలో వెలుగొందుతున్న రుక్మిణి వసంత్, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి :

Salman Khan | టాలీవుడ్‌లోకి ‘భాయ్‌జాన్’ ఎంట్రీ… దిల్ రాజు -వంశీ పైడిపల్లి కాంబోలో సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్
Biker | ‘బైకర్’ కోసం 23 కేజీల బ‌రువు త‌గ్గిన శర్వానంద్ .. యాక్షన్ సీక్వెన్స్‌ల్లో ప‌లు ప్రమాదాలు

Latest News