Sharukh Khan| గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టిన షారూఖ్ ఖాన్.. ఎందుకో తెలుసా?
Sharukh Khan| ఐపీఎల్ సీజన్ 17లో కోల్‌కతా నైట్ రైడర్స్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్స్‌లో చెత్త ప్రదర్శన కనబరచిన కేకేఆర్ జట్టు ఈ
Sharukh Khan| ఐపీఎల్ సీజన్ 17లో కోల్‌కతా నైట్ రైడర్స్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్స్‌లో చెత్త ప్రదర్శన కనబరచిన కేకేఆర్ జట్టు ఈ సీజన్‌లో కేవలం మూడంటే మూడు మ్యాచ్‌లు మాత్రమే ఓడి టాప్ ప్లేస్‌లో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్ 1లో ఆ జట్టుని చిత్తు చేసిన ఈ జట్టు డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్లింది. అక్కడ కూడా ఎస్ఆర్‌హెచ్‌ని మడతపెట్టేసి కప్ ఎగిరేసుకుపోయింది. అయితే ఈ సారి కేకేఆర్ ఇంత స్ట్రాంగ్‌గా ఉండడానికి ముఖ్య కారణం మెంటార్ గౌతమ్ గంభీర్. తనదైన దూకుడు నిర్ణయాలతో జట్టుకి మంచి విజయం దక్కేలా చేశాడు., గంభీర్ మార్గదర్శకత్వంలో కేకేఆర్ ముచ్చటగా మూడోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది.

గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ 2012,2014 సంవత్సరాలలో ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ గెలిచింది లేదు. అయితే 2024 సీజన్ కోసం గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా కోల్‍కతా మేనేజ్‍మెంట్ తీసుకు రాగా, ఆయన మార్గదర్శకత్వంలో కేకేఆర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అయితే కేకేఆర్ ఫైనల్ లో గెలిచాక కోల్‍కతా కో-ఓనర్, బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్ దగ్గరకు వచ్చి ఆయన నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ సన్నివేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన షారూఖ్ వెంటనే రికవరీ అయి ఫినాలే మ్యాచ్‌కి వచ్చి సందడి చేశాడు.
చెపాక్ మైదానంలో తిరుగుతూ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. కోల్‍కతా ప్లేయర్లను కౌగిలించుకుంటూ అభినందించారు.మరోసారి పేలవ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తయ్యింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని, ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పక గెలుస్తుందని అందరు అనుకున్నారు .కాని కేకేఆర్ కప్ ఎగరేసుకుపోయింది. ఈ ఓటమి ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు కన్నీళ్లనే మిగిల్చింది అని చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram