Upasana|మా ఆయనకి ఆ హీరోయిన్‌తో కెమిస్ట్రీ బాగుంటుంది.. ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Upasana| టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్-ఉపాసన జంట ఒకటి. పెళ్లై పదకొండేళ్లు అవుతున్నా కూడా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 యేళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అభిమానులు మెగాస్టార్ చిరంజీవి ఇంటి
Upasana| టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్-ఉపాసన జంట ఒకటి. పెళ్లై పదకొండేళ్లు అవుతున్నా కూడా ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 యేళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అభిమానులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరో ధనలక్ష్మీ వచ్చిందని చెప్పుకొచ్చారు. మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి ప్రీతి పాత్రమైన మంగళ వారం రోజున మా ఇంటికి మహా లక్ష్మీ వచ్చిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. ఇక పుట్టిన పాప క్లింకారతో కలిసి ఈ జంట చాలా సంతోషంగా ఉంటూ వస్తుంది.

ఉపాసన అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తుంది. రామ్ చరణ్‌లో క్రమశిక్షణ అంటే ఉపాసనకు ఇష్టమట. ఉపాసనకి అండగా నిలబడే తీరు, ప్రతీ విషయంలో సపోర్ట్ చేసే గుణమంటే రామ్ చరణ్‌కు ఇష్టమట. మీ మీ దృష్టిలో శక్తి, బలం, పవర్ అంటే ఏంటి? అని అడిగితే.. భద్రత అనేది నా బలం అని ఉపాసన చెప్పుకొచ్చారు. ఉపాసనే తన బలం అని, నా వెంట ఆమె ఉండటమే బలమని, ఆమె నాకు ఇచ్చే విలువైన సమయమే తన బలం అని రామ్ చరణ్ తెలిపాడు. ఇక గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పని చేశాడు.
కొందరితో రొమాన్స్ కూడా చేశాడు. అయితే రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసిన హీరోయిన్స్‌లో ఉపాసనకి ఎవరంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో ఉపాసనని ప్రశ్నించగా, ఆసక్తికర సమాధానం ఇచ్చింది. రామ్ చరణ్- తమన్నా రొమాన్స్ బాగుంటుంది. వాళ్ల స్క్రీన్ టైం బాగుంటుంది అని ఉపాసన పేర్కొంది. గతంలో ఉపాసన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే అంత మంది హీరోయిన్స్‌ని వదిలేసి ఉపాసన తమన్నా పేరు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది కదా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram