మే 22న.. థియేటర్లలోకి వరలక్ష్మి, నవీన్ చంద్రల ‘పోలీస్ కంప్లైంట్’
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర కలిసి నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ మే 22న రిలీజ్. యాక్షన్, హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ప్రత్యేక కథ.
విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ సృష్టించే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమా మే 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కృష్ణసాయి బర్త్‌డే సందర్భంగా, ఆయన అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణకు ట్రిబ్యూట్‌గా రూపొందించిన స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ—వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుందని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి కొత్త అనుభూతి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కథ, పాత్రల రూపకల్పన ప్రత్యేకంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

సంజీవ్ మేగోటి గతంలో అఘోర, పౌరుషం, ఆప్త, దండు, రాఘవరెడ్డి, ఆదిపర్వం వంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ ద్వారా మరో విభిన్న కథను అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram