Mutton Pulusu | మటన్ పులుసును ఇలా తయారు చేసుకోండి.. యమరుచిగా ఉంటుంది..!
Mutton Pulusu : మటన్‌తో చేసుకునే రుచికరమైన వంటకాల్లో మటన్ పులుసు కూడా ఒకటి. అన్నం, చపాతీ, రాగి సంగటి ఇలా దేనితోనైనా మటన్ పులుసును ఆరగించవచ్చు. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. బ్యాచిలర్స్, ఇల్లాళ్లు ఎవరైనా దీన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు. తక్కువ మటన్‌తో ఎక్కువ మంది భోజనం చేయాలన్నా కూడా ఇది బెటర్ ఆప్షన్. ఈ రుచికరమైన మటన్ పులుసు తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..
వంట నూనె – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 8.
ఉడికించేందుకు..
మటన్ – అరకిలో, ఉప్పు – కొద్దిగా, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు.
తయారీ విధానం
ముందుగా కుక్కర్‌లో మటన్ వేసుకోవాలి. తర్వాత దానితో కలిపి ఉడికించాల్సిన పదార్థాలు వేసి మూతపెట్టి 4 నుంచి 6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక వంట పాత్రలో వెల్లుల్లి తప్ప మిగిలిన మసాలా పదార్థాలు వేసి, చిన్న మంటపై దోరగా వేయించాలి. తర్వాత ఓ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఒక వంట పాత్రలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేయించాలి. ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్‌ను నీటితో సహా వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత, మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పొడి ఇందులో వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ పులుసు రెడీ. దీన్ని చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశ ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram