Water fry | వెజ్, నాన్‌వెజ్ పదార్థాలనే కాదు.. నీళ్లను కూడా డీప్ ఫ్రై చేయొచ్చు.. ఎలాగో తెలుసా..?
Water fry : మ్యాగీ, పానీ పూరి, ఐస్ క్రీమ్, పరోటా, న్యుటెల్లా బిర్యానీ తదితర వింతైన, విచిత్ర వంటకాల గురించి చాలామందికి తెలుసు. వెజ్, నాన్‌వెజ్ పదార్థాల డీప్ ఫ్రై గురించి కూడా అందరికీ బాగా తెలుసు. కానీ నీళ్లను డీప్ ఫ్రై చేయడం గురించి మీలో ఎవరికైనా తెలుసా..? వాటర్‌ను డీప్ ఫ్రై ఎలా చేస్తారు.. అని ఆలోచిస్తున్నారా..? మీరు చదువుతున్నది నిజమే..! మరి ఈ డీప్ ఫ్రైడ్ వాటర్ సంగతేందో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే పూర్తిగా చదవండి..

ఈ సీజన్‌లోనే లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ అయిన డీప్ ఫ్రైడ్ వాటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఈ కొత్త రకం వంటకంపై నెటిజన్‌ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. వాస్తవానికి డీప్ ఫ్రైడ్ వాటర్ మొదటి వీడియోను 2016 లోనే యూట్యూబ్‌లో పోస్ట్‌చేశారు. కానీ అప్పట్లో అది ట్రెండింగ్ కాలేదు. అయితే 2020, డిసెంబర్‌లో జేమ్స్ ఆర్గిల్ అనే కెమికల్ ఇంజినీర్ మొదటిసారి డీప్ ఫ్రైడ్ వాటర్‌ను ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఆ వీడియోను ది యాక్షన్ ల్యాబ్ అనే తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అసలు డీప్ ఫ్రైడ్ వాటర్ అంటే ఏంది..?
డీప్ ఫ్రైడ్ వాటర్ అంటే మీలో చాలామంది మరిగే నీళ్లకు మరో కొత్తరకం పేరు అని ఊహిస్తూ ఉండవచ్చు. కానీ మీ ఊహ నిజం కాదు. కాల్షియం ఆల్జీనేట్ అనే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగించి నీళ్లను కూడా డీప్ ఫ్రై చేయవచ్చు. సజల కాల్షియం క్లోరైడ్, సజల సోడియం ఆల్జీనేట్‌ల మిశ్రమాన్నే ఈ డీప్ ఫ్రైడ్ వాటర్ తయారికీ ఉపయోగిస్తారు. ఈ రెండు రకాల రసాయనాలు నీటి చుట్టూ ఒక స్తరంలా ఏర్పడి నీటిని బంధించి ఉంచుతాయి.
డీప్ ఫ్రైడ్ వాటర్ అనే భావన మొదట 2016లో ఫుడ్ బ్లాగర్, చెఫ్, ఫ్రైడ్ ఫుడ్ అభిమాని అయిన జోనాథన్ మార్కస్ మదిలో మెదిలింది. ఆయన వాటర్‌ను డీప్ ఫ్రై చేసి ఆ వీడియోను యూట్యూబ్ పేజీలో అప్‌లోడ్ చేశాడు. కానీ అప్పట్లో ట్రెండ్ కాలేదు. ఇప్పుడు జేమ్స్ ఆర్గిల్ తయారుచేసిన డీప్ ఫ్రైడ్ వాటర్ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అయితే డీప్ ఫ్రైడ్ వాటర్‌ను తయారు చేయాలనుకునే వారికి జేమ్స్ హెచ్చరిక చేశారు. ఎందుకంటే సరైన రీతిలో చేయకపోతే ఇది చాలా ప్రమాదకరమని ఆయన చెబుతున్నాడు.