Food | కమ్మకమ్మటి మసాలా పల్లీలు.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి..

Food | మసాలా పల్లీలు..! వీటిని చూస్తేనే నోరూరుతుంది. ఎందుకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సాయంత్రం పూట మసాలా పల్లీలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ మసాలా పల్లీలు కేవలం రుచికి మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని రోజూ మితంగా తింటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఈ మసాలా పల్లీలను తయారు చేయడం చాలా సులభం.

Food | కమ్మకమ్మటి మసాలా పల్లీలు.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి..

Food : మసాలా పల్లీలు..! వీటిని చూస్తేనే నోరూరుతుంది. ఎందుకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సాయంత్రం పూట మసాలా పల్లీలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఈ మసాలా పల్లీలు కేవలం రుచికి మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని రోజూ మితంగా తింటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఈ మసాలా పల్లీలను తయారు చేయడం చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం మసాలా పల్లీలు తయారు చేసుకుని కమ్మదనాన్ని ఆస్వాదిద్దాం పదండి.

కావాల్సినవి..

1. రెండు కప్పుల వేరుశెనగలు
2. తగినంత కారం
3. 1/4 టీస్పూన్ మామిడికాయ పొడి లేదా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
4. 1/4 టీస్పూన్ పసుపు పొడి
5. కొద్దిగా ఇంగువ
6. తగినంత ఉప్పు

తయారీ విధానం..

ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో వేరుశెనగలు వేసి దోర రంగులోకి వచ్చేవరకు సన్న మంట మీద వేయించాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్‌ల నీళ్లుపోసి కారం, మామిడికాయ పొడి లేదా నిమ్మరసం, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపాలి. మసాలా రెడీ అవుతుంది. ఈ మసాలాను వేయించిన పల్లీలలో పోసి కలుపుకోవాలి. తర్వాత పల్లీల పాత్రకింద స్టవ్‌ను మళ్లీ ఆన్‌చేసి సన్న మంట మీద తడిదనం పోయేలా వేయించాలి. అనంతరం వాటిన చల్లబర్చుకుని గాలి చొరబడని డబ్బాలో పోసిపెట్టుకోవాలి. అంతే అవసరమైనప్పుడల్లా రుచికరమైన మసాలా పల్లీలను ఆస్వాదించవచ్చు.