Prabhas | ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు…!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు లెగసీని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. 2002లో ఈయన ఈశ్వర్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. అంటే దాదాపు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచాయి. ఈశ్వర్ తరువాత ఆయన రాఘవేంద్ర చిత్రంలో నటించిన వర్షం చిత్రం ఆయనకు పెద్ద హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం చిత్రాలు పర్వాలేదనిపించాయి. చత్రపతి చిత్రం ఘన విజయం సాధించింది. పౌర్ణమి, యోగి, మున్నా, […]

Prabhas | ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు…!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు లెగసీని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. 2002లో ఈయన ఈశ్వర్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. అంటే దాదాపు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచాయి. ఈశ్వర్ తరువాత ఆయన రాఘవేంద్ర చిత్రంలో నటించిన వర్షం చిత్రం ఆయనకు పెద్ద హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం చిత్రాలు పర్వాలేదనిపించాయి. చత్రపతి చిత్రం ఘన విజయం సాధించింది. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వంటి చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు బాగా ఆడాయి.

రెబల్ చిత్రం నిరాశపరిచినప్ప‌టికీ మిర్చి చిత్రం పెద్ద హిట్ అయింది. ఇక బాహుబలి 1,బాహుబలి 2లతో ఆయన స్థాయి పాన్ ఇండియా స్థాయికి, పాన్ వరల్డ్ రేంజ్ కి చేరింది. కానీ ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఎప్పటినుంచో ఓ ప్రాజెక్టు ప్లానింగ్ లో ఉంది. అది మిస్ ఫైర్ అవుతుందేమో అని ఆయ‌న అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. దానికి కూడా ఒక కార‌ణం ఉంది. సిద్దార్ధ్ ఆనంద్ ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్స్ మీద త‌ప్ప క‌థ క‌థ‌నాల‌పై దృష్టి పెట్ట‌రు అనే కంప్లైంట్ ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై కాస్త టెన్షన్ పడుతున్నారు. గతంలో సాహూచిత్రంలో కూడా ఇదే జరిగింది. అందువల్లే వారు ఇంతగా టెన్షన్ పడుతున్నారు. కానీ తాజాగా వచ్చిన పఠాన్ సినిమాతో సిద్ధార్థ ఆనంద్ తానేమిటో నిరూపించుకున్నారు.

స్టార్ పవర్ ని వాడుకొని ఎలివేషన్ పండించడంలో సిద్ధార్థ ఆనంద్ మేటి. ఇలా చేసి అతడు చాలా హిట్లు సాధించారు. పఠాన్ తర్వాత హృతిక్ రోషన్ తో ఫైటర్ సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కాగానే ప్రభాస్ తో నెక్స్ట్ మూవీ మొద‌లు పెట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ముందే వార్ 2 చిత్రం ప్రారంభించాల‌ని ఆయ‌న ఆశించారు. ప్రభాస్, హృతిక్ ల కాంబోలో వార్ 2 తీయాలని ఆశపడ్డారు. కానీ అది సాధ్యపడలేదు. దాంతో ఫైట‌ర్ సినిమా తీయబోతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ లోపు ప్రభాస్ కూడా తాను ఒప్పుకున్న మిగిలిన చిత్రాలను పూర్తి చేసే ప‌నిలో బిజీ కానున్నారు. ఇలా సిద్ధార్థ ఆనంద్ ప్ర‌భాస్ ల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ప‌ట్టాలెక్క‌డానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది