Om Raut: ఈసారైనా.. ప‌రువు నిలిచేనా

  • By: sr    news    Dec 17, 2024 1:50 PM IST
Om Raut: ఈసారైనా.. ప‌రువు నిలిచేనా

ఆదిపురుష్ సినిమాతో జీవితానికి స‌రిపోను విమ‌ర్శ‌లు ఎదుర్కొని, మ‌రెవ‌రికీ జ‌ర‌గ‌నంతా ట్రోలింగ్‌తో దేశ‌వ్యాప్తంగా ఫేమ‌స్ అయ్యాడు బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ (Om Raut).

ఆ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయ‌న ఇప్పుడో ఇంట్రెస్టింగ్ కాంబినేష‌న్‌లో సినిమాను తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మైన‌ట్లు బీ టౌన్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

త‌న‌కు మొద‌టి సారి సినిమా అవ‌కాశం ఇచ్చి లైఫ్ ఇచ్చిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో మ‌రో మూవీకి ఫ్లాన్ చేస్తున్న‌ట్లు వినికిడి. గ‌తంలో ఓం రౌత్ అజ‌య్ దేవ్‌గ‌ణ్‌తో తీసిన ‘తన్హాజీ’ మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు అవార్డుల‌ను సైతం గెలుచుకుంది.

ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా అజ‌య్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని సినిమాలో కీ రోల్ కోసం హృతిక్ రోషన్‌ను సంప్ర‌దిస్తున్న‌ట్లు నెట్టింట న్యూస్ వైర‌ల్ అవుతోంది.

అయితే ఓం రౌత్ ఇప్ప‌టివ‌ర‌కు తీసిన రెండు చిత్రాలు చారిత్ర‌క ఘ‌ట్టాల నేప‌థ్యంలో తీసిన‌వే కావ‌డంతో కొత్త‌గా తెర‌కెక్క‌బోయే మూవీ కూడా ఇదే కోవ‌కు చెందిన‌దే అనే మాట‌లు బాగా వినిపిస్తున్నాయి. చూడాలి మ‌రి ఈ సారి రౌత్ ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో.