Samyuktha Menon | సంయుక్తా మీనన్.. ఆ ముసలి దర్శకుడితో హద్దులు దాటిందని అంటున్నారట

Samyuktha Menon | హీరోయిన్ అన్నాక దర్శకుడితో రూమర్స్ అనేవి కామన్. ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో దాసరి ఆ టైమ్ నుంచి ఉన్నవే. హీరోయిన్లు.. హీరోలతో కాస్త క్లోజ్‌గా ఉన్నా సరే.. నెట్టింట రచ్చ రచ్చే. అలా ఆ హీరోయిన్‌కి, దర్శకుడికి మధ్య ఏదో రహస్యంగా నడుస్తుందని, ఇద్దరి మధ్య చాలా గ్రంథమే ఉందనే మాటలు చిలవలు పలవలై పాకేసరికి వాటికి చెక్ పెట్టాలని కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకుందట హీరోయిన్. ఇంతకీ ఇంత […]

  • Publish Date - July 15, 2023 / 02:29 AM IST

Samyuktha Menon |

హీరోయిన్ అన్నాక దర్శకుడితో రూమర్స్ అనేవి కామన్. ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో దాసరి ఆ టైమ్ నుంచి ఉన్నవే. హీరోయిన్లు.. హీరోలతో కాస్త క్లోజ్‌గా ఉన్నా సరే.. నెట్టింట రచ్చ రచ్చే. అలా ఆ హీరోయిన్‌కి, దర్శకుడికి మధ్య ఏదో రహస్యంగా నడుస్తుందని, ఇద్దరి మధ్య చాలా గ్రంథమే ఉందనే మాటలు చిలవలు పలవలై పాకేసరికి వాటికి చెక్ పెట్టాలని కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకుందట హీరోయిన్. ఇంతకీ ఇంత చెప్పినా ఆమె ఎవరో అర్థంకాలేదా.. అదే ‘విరూపాక్ష’ సినిమాలో నటించిన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్.

‘భీమ్లా నాయక్, బింబిసార, సార్’ సినిమాలు మూడూ నటిగా సంయుక్తకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ మూడు సినిమాలే కాక ఈమధ్య నటించిన ‘విరూపాక్ష’ సినిమా కూడా సంయుక్తకు గోల్డెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చిపెట్టింది.అయితే అంతా సవ్యంగా నడిస్తే ఇక విషయం ఏముంటుంది?. నటిగా ఎంత మంచి పేరొచ్చిందో, ఈ హీరోయిన్ గురించి గాసిప్స్ కూడా అంతే జోరుగా ట్రోల్ అవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి, సంయుక్తకి మధ్య ఏదో ఉందంటూ ఆ మధ్య.. ఆ మధ్య ఏంటి.. ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

‘భీమ్లా నాయక్, సార్’ సినిమాలు త్రివిక్రమ్ చేతుల మీదుగానే పూర్తయ్యాయి. ఈ సినిమాలన్నీ త్రివిక్రమ్ సంయుక్తకి ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ కోసం చేస్తున్నాడని, అతగాడి సపోర్ట్‌తోనే ఇదంతా జరుగుతుందని ప్రచారం అయితే మహ జోరుగా సాగుతుంది. ఈ వార్త అటు మలయాళ ఇండస్ట్రీకి కూడా పాకి ఓ ముసలి దర్శకుడితో హద్దులు దాటిన హీరోయిన్ అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయట. అక్కడంతా సంయుక్తపై ఇలాంటి వార్తలు వైరల్ అవుతుండటం ఆమె వరకు చేరిందట.

ఇక వీటికి అడ్డుకట్ట వేయకపోతే ఫ్యూచర్ ఉండదనుకుందో ఏమో.. సంయుక్త వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్, అల్లూ అర్జున్‌తో ఉండగా ఆ సినిమా నుండి బయటకు వచ్చేసిందని టాక్. ఇప్పటికైనా రూమర్స్‌కి చెక్ పెట్టిందని, ఎటూ పోవడానికి వీలుకాని పరిస్థితిలో వెనక్కు తగ్గి మంచి నిర్ణయమే తీసుకుందని, ఇకనైనా వచ్చిన పేరును కాపాడుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని ఆమె సన్నిహితులు కొందరు సంయుక్తకు సలహాలు ఇస్తున్నారట. ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చినా ఇబ్బందే.. అదే ఎవరైనా సపోర్ట్ చేసినా రూమర్స్ వచ్చిపడతాయి. దీనినే అంటారు.. ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ అని.

Latest News