Health tips | మలబద్ధకం సమస్య తీవ్రంగా విసిగిస్తోందా.. అయితే మీ లైఫ్‌స్టైల్‌ను ఇలా మార్చుకోండి..!

Health tips : జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే మలబద్ధకం (Constipation) సమస్య వస్తుంది. జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడంవల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారంపడి జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకంవల్ల మలవిసర్జన సరిగా జరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నొప్పి కూడా మొదలవుతుంది. తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. ఏ పనీ కుదురుగా చేయలేకపోతాం. మరి ఈ సమస్యను మీరు కూడా ఫేస్‌ చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

  • By: Thyagi |    health |    Published on : May 26, 2024 11:00 AM IST
Health tips | మలబద్ధకం సమస్య తీవ్రంగా విసిగిస్తోందా.. అయితే మీ లైఫ్‌స్టైల్‌ను ఇలా మార్చుకోండి..!

Health tips : జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే మలబద్ధకం (Constipation) సమస్య వస్తుంది. జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడంవల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారంపడి జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకంవల్ల మలవిసర్జన సరిగా జరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నొప్పి కూడా మొదలవుతుంది. తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. ఏ పనీ కుదురుగా చేయలేకపోతాం. మరి ఈ సమస్యను మీరు కూడా ఫేస్‌ చేస్తున్నారా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. దాంతో ఏ రోజుకు ఆ రోజుకు జీర్ణాశయం, పేగులు శుభ్రపడుతాయి. దాంతో మలబ్ధకం దరిచేరదు. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్‌ కంటెంట్‌ కోసం దోసకాయ, శనగ, పెసలు లాంటి గింజలు, యాపిల్స్, ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు

మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లకు ఉదయం పూట బాధ ఎక్కవుగా ఉంటుంది. లేవగానే మల విసర్జన జరగక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజూ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసెడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల మీ పెద్దపేగు గోడల్లో కదలికలు సులభమవుతాయి. దీన్ని వైద్యపరిభాషలో గ్యాస్ట్రో-కోలిక్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. ఇది మలాన్ని బయటకు నెట్టేస్తుంది.

రోజుకు నాలుగు లీటర్ల నీళ్లు

మన శరీరానికి రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు అవసరమవుతుంది. కావాల్సినన్ని నీళ్లు తీసుకోకపోతే శరీరం డీ హైడ్రేట్‌ అవుతుంది. దానివల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణంకాక మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. 300 మిల్లీలీటర్ల గ్లాసుతో రోజుకు కనీసం 12 గ్లాసులైనా నీళ్లు తీసుకోవాలి.

శారీరక వ్యాయామం

ఈ రోజుల్లో చాలామందివి సిట్టింగ్‌ కొలువులే. దానివల్ల ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే పనిప్రదేశంలో గంటకు ఒకసారైనా లేచి కాసేపు నడవాలి. ఆహారం తీసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు నడిస్తే జీర్ణం సులువుగా జరుగుతుంది. దాంతో మలబ్ధకం సమస్య పారిపోతుంది.