Kolhapur | అమిత్ షా..ప్రియాంక టూర్లకు వర్షాల బ్రేక్
Kolhapur విధాత: భారీ వర్షాల నేపధ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటనలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఈనెల 29న అమిత్‌షా, 30వ తేదిన ప్రియాంకగాంధీలు పర్యటించాల్సివుంది. అయితే వరుస వర్షాల కారణంగా అమిత్ షా టూర్ వాయిదా పడిందని, తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్‌లో ఈ నెల30వ తేదీన జరుప తలపెట్టిన ప్రియాంకగాంధీ బహిరంగ సభను ఆగస్టు […]

Kolhapur
విధాత: భారీ వర్షాల నేపధ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటనలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఈనెల 29న అమిత్‌షా, 30వ తేదిన ప్రియాంకగాంధీలు పర్యటించాల్సివుంది. అయితే వరుస వర్షాల కారణంగా అమిత్ షా టూర్ వాయిదా పడిందని, తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్‌లో ఈ నెల30వ తేదీన జరుప తలపెట్టిన ప్రియాంకగాంధీ బహిరంగ సభను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరిక కూడా 5వ తేదీకి వాయిదా పడింది. ఏఐసీసీ అగ్రనేతలలో ఒకరైన ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని జూపల్లి నిర్ణయించుకున్నారు. ప్రియాంక షెడ్యూల్ కుదరకపోవడంతో ఒకసారి, వర్షాలతో మరోసారి ప్రియాంకగాంధీ కొల్లాపూర్ సభ వాయిదా పడటం జూపల్లిని నిరాశ పరిచింది. ఇదే సమయంలో జూపల్లిని ఢిల్లీకి వచ్చి పార్టీ లో చేరాలని ఏఐసీసీ ఆహ్వానించింది. అందుకు జూపల్లి ససేమిరా అనడంతో కొల్లాపూర్ ప్రియాంకగాంధీ సభను ఆగస్టు 5కు వాయిదా వేశారు.