Health Tips | ఈ ఐదు అలవాట్లను వదులుకోండి.. యవ్వనంగా కనిపిస్తారు..!
Health Tips | ప్రస్తుత గజిబిజిగా మారిన జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్ల కారణంగా జీవితకాలం తగ్గుతూ వస్తున్నది. దీనికి తోడు పెరుగుతున్న కాలుష్యం జన జీవితంపై పెనుప్రభావం చూపుతున్నది. కొందరు తక్కువ ఏజ్‌లోనే.. వృద్ధాప్య ఛాయలతో బాధపడుతున్నారు. అయితే, ప్రతి వ్యక్తి తన దినచర్యలో స్వల్ప మార్పులు చేసుకుంటూ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పలు అలవాట్లను వదులుకుంటే ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారని తెలుపుతున్నారు. ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.. జుట్టు, […]
Health Tips | ప్రస్తుత గజిబిజిగా మారిన జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్ల కారణంగా జీవితకాలం తగ్గుతూ వస్తున్నది. దీనికి తోడు పెరుగుతున్న కాలుష్యం జన జీవితంపై పెనుప్రభావం చూపుతున్నది. కొందరు తక్కువ ఏజ్‌లోనే.. వృద్ధాప్య ఛాయలతో బాధపడుతున్నారు. అయితే, ప్రతి వ్యక్తి తన దినచర్యలో స్వల్ప మార్పులు చేసుకుంటూ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పలు అలవాట్లను వదులుకుంటే ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారని
తెలుపుతున్నారు.
ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..
- జుట్టు, చర్మం ఆరోగ్యానికి కొవ్వులు చాలా ముఖ్యమైనవి. చాలా మంది అన్ని రకాల కొవ్వులు శరీరానికి హానికరం అని అనుకుంటారు. దీంతో ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం మానేయడం ద్వారా చర్మానికి, వెంట్రుకలకు చాలా నష్టం వాటిల్లుతుంది. తద్వారా చర్మంలో మార్పులు వచ్చి.. వెంట్రుకలు రంగుమారి ఎక్కువ వయసున్న వ్యక్తులుగా కనిపిస్తారు.
- కొందరు వ్యక్తులు చాలా సోమరిగా ఉంటారు. రోజంతా ఒకే చోట గంటల తరబడి కూర్చుంటారు. దీంతో శరీరంలో జీవక్రియ బలహీనపడి శరీరంలో కొవ్వు పెరగడం మొదలవుతుంది. ఈ బద్ధకమే మిమ్మల్ని స్థూలకాయం, మధుమేహం, రక్తపోటుకు బాధితులుగా మారుస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
- చాలా మంది ఉదయం అల్పాహారంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. పండ్లను ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో ఫ్రక్టోజ్ స్థాయి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో శరీరంలో చక్కెర స్థాయి పెరగడం మొదలవుతుంది.
- చాలా మందికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉంటుంది. రాత్రిపూట తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో శరీరంలో కొవ్వు పెరగడం మొదలవుతుందని, ఫలితంగా ఊబకాయం బారినపడుతారని హెచ్చరిస్తున్నారు.
- సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం వల్ల చర్మ దెబ్బతింటుందని చాలా మంది భావిస్తుంటారు. సూర్యుడి నుంచి వచ్చే యూవీ వికరణాల నుంచి సన్ స్క్రీన్ లోషన్ మీ చర్మాన్ని రక్షిస్తుందని గుర్తుంచుకోండి. చర్మంపై ముడతలు, చిన్న మచ్చలకు కూడా కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram