Health tips | వెన్ను కింది భాగంలో భరించలేని నొప్పి.. పరిష్కార మార్గం చెప్పిన పరిశోధకులు..!
Health tips : కొంత మందికి వెన్ను కింది భాగంలో భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. సరిగ్గా నిలబడనివ్వదు. కుదురుగా కూర్చోనివ్వదు. ఇంతటి బాధాకరమైన నొప్పికి నడకే చక్కటి పరిష్కార మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మెక్వారీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక 'లాన్సెట్'లో ప్రచురితమైంది.

Health tips : కొంత మందికి వెన్ను కింది భాగంలో భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. సరిగ్గా నిలబడనివ్వదు. కుదురుగా కూర్చోనివ్వదు. ఇంతటి బాధాకరమైన నొప్పికి నడకే చక్కటి పరిష్కార మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మెక్వారీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైంది.
ఆ పరిశోధక బృందం మొత్తం 700 మందిని మూడు బృందాలుగా విభజించింది. ఒక బృందానికి నడకను సిఫారసు చేసింది. రెండో బృందానికి ఆరునెలలపాటు ఫిజియోథెరపీ చేసింది. మూడో బృందానికి ఏ చికిత్సా చేయలేదు. ఈ పరిశోధనలో అన్నింటికన్నా నడకే ఉత్తమమైనదన తేలింది. నడకకు ఖర్చు కూడా ఉండదని, పైగా అది తేలికైన పని పరిశోధకులు పేర్కొన్నారు.
ఇక ఫిజియోథెరపీ విషయానికి వస్తే దీనికి నిపుణుల పర్యవేక్షణ కావాలని, పైగా ఖరీదైనదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చన్నా. నడకవల్ల వెన్ను నొప్పి తగ్గుతుందని, గుండె, రక్తనాళాలకు, మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. బరువు తగ్గిస్తుందని, బీపీ, షుగర్ లాంటి దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలను కూడా అదుపులో ఉంచుతుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వెన్ను దిగువ భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య 2020 నాటికి 62 కోట్లుగా ఉందని, 2050 కల్లా ఆ సంఖ్య 84 కోట్లు దాటుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. భారత్‌లో 66 శాతంమంది వెన్ను నొప్పి బారిన పడుతున్నారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, శారీరక శ్రమ చేసే కూలీలే ఉన్నారని పేర్కొంది. కాబట్టి సమస్య వచ్చిన తర్వాత బాధపడేకంటే రాకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రాత్రంతా ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగండి.. ఫలితం మామూలుగా ఉండదుగా..!
Monkey pox | అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి.. ఈ వ్యాధి సోకితే ఏమవుతుంది..?
Dry fish | వాసనకు భయపడి వ్వాక్ ఎండు చేపలు అంటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..!
Health tips | మీలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నదా.. అయితే ఈ పండ్లు తప్పక తినండి..!
Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్ చేయొద్దు..!