Monkey pox | అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి.. ఈ వ్యాధి సోకితే ఏమవుతుంది..?
Monkey pox : ఒకప్పుడు కరోనా మహమ్మారి మాదిరిగానే ఇప్పుడు మంకీ పాక్స్ (Monkey pox) కూడా ప్రపంచ దేశాలను భయపెడుతున్నది. ముందుగా ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తిచెందిన మంకీపాక్స్ ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరింది. ఆఫ్రికా దేశాల్లో తీవ్ర స్థాయిలో విస్తరిస్తుండటంతో మంకీ పాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి..? ఈ వ్యాధి సోకితే ఏమవుతుంది..? అనే విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి.
Monkey pox : ఒకప్పుడు కరోనా మహమ్మారి మాదిరిగానే ఇప్పుడు మంకీ పాక్స్ (Monkey pox) కూడా ప్రపంచ దేశాలను భయపెడుతున్నది. ముందుగా ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తిచెందిన మంకీపాక్స్ ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరింది. ఆఫ్రికా దేశాల్లో తీవ్ర స్థాయిలో విస్తరిస్తుండటంతో మంకీ పాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి..? ఈ వ్యాధి సోకితే ఏమవుతుంది..? అనే విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి.
మంకీ పాక్స్ అంటే..
- మంకీ పాక్స్‌ను మొదట 1958లో గుర్తించారు. 1970లో మొదటిసారిగా ఇది ఒక మనిషికి సోకింది. ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఈ వైరస్ ఎక్కువగా కనిపించేది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో ఆఫ్రికా బయట కూడా భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దాంతో ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు ఈ వ్యాధిపై పరిశోధనలకు నిధులను పెంచాయి.
- అంతకుముందు మంకీపాక్స్ గుర్తింపు, చికిత్స, నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి. అయినా ఆ వ్యాధిని పెద్దగా లెక్కచేయలేదు. అయితే 2022-23లో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూడటంతో కదలిక వచ్చింది. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిని క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్) గా వర్గీకరించారు.
- వీటిలో క్లాడ్-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యుమోనియా, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1 నుంచి 10 శాతం వరకు ఉంది. ఇక క్లాడ్-2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
- క్లాడ్-1 వేరియంట్ లైంగిక సంబంధాల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. గతంలో ఈ విధంగా క్లాడ్-1 వ్యాపించేది కాదని జనవరిలో విడుదలైన ఓ పరిశోధనా పత్రం పేర్కొన్నది. ఒకప్పుడు ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషుల్లోకి మాత్రమే వ్యాపించేది. ఇప్పుడు మాత్రం మనుషుల నుంచి మనుషులకు వస్తోంది. ప్రస్తుతం నాలుగు దేశాల్లో క్లాడ్-1 వేరియంట్ సోకిన 100 కేసులను గుర్తించారు. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా దేశాల్లో ఈ కేసులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
Health tips | మీలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నదా.. అయితే ఈ పండ్లు తప్పక తినండి..!
Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్ చేయొద్దు..!
Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!
Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్..!
Health tips | షుగర్ రోగులు తరచూ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram