Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్‌..!

Health tips : ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవనశైలిలో వీలైనంత ఎక్కువగా పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అనేక ముఖ్యమైన పోషకాల లోపాన్ని తీరుస్తాయి. అందుకే వైద్య నిపుణులు పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తుంటారు. ఆరోగ్యానికి మేలుచేసే పండ్లలో అవకాడో కూడా ఒకటి. అవకాడోను ఎలిగేటర్ పియర్ అని కూడా పిలుస్తారు. దీనిలో పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, కాపర్, జింక్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడంవల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

  • By: Thyagi |    health |    Published on : Aug 03, 2024 9:05 PM IST
Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్‌..!

Health tips : ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవనశైలిలో వీలైనంత ఎక్కువగా పండ్లు (Fruits)తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అనేక ముఖ్యమైన పోషకాల (Proteins) లోపాన్ని తీరుస్తాయి. అందుకే వైద్య నిపుణులు పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తుంటారు. ఆరోగ్యానికి మేలుచేసే పండ్లలో అవకాడో (Avocado) కూడా ఒకటి. అవకాడోను ఎలిగేటర్ పియర్ (Alligator pear) అని కూడా పిలుస్తారు. దీనిలో పొటాషియం (Potassium), కాల్షియం (Calcium), ఐరన్ (Iron), మాంగనీస్ (Manganese), ఫాస్పరస్ (Phosphorus), కాపర్ (Copper), జింక్ (Zinc) వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడంవల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

ప్రయోజనాలు

బరువు తగ్గడానికి : మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే అవకాడో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన భావనతో ఉంచుతాయి. దాంతో అతిగా తినడం మానేస్తారు. బరువు అదుపులో ఉంటుంది.

మధుమేహం నియంత్రణకు : మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ అవకాడో తినాలి. దీన్ని తినడంవల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎముకల గట్టితనానికి : అవకాడోలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని రెగ్యులర్ వినియోగం మీ ఎముకలను బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలవల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్‌ల నుంచి అయినా ఉపశమనం పొందవచ్చు.

దృష్టి లోపం నివారణ : చిన్న వయస్సులోనే దృష్టి మసకబారే సమస్య ఉంటే అవకాడో తప్పక తినాలి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అవకాడోలో కంటిని చూపును మెరుగుపర్చే పోషకాలు ఉన్నాయి.

గుండె ఆరోగ్యానికి : అవకాడో వినియోగం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా ఈ పండు చాలా మంచిది.

ఇవి కూడా చదవండి 

Health tips | ఈ పండ్ల జ్యూస్‌లు తరచూ తాగితే.. మీ జ్ఞాపకశక్తిని మీరే నమ్మలేరు..!

Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. కిడ్నీలు ప్రమాదంలో పడ్డాయేమో.. పరీక్షలు చేయించుకోండి..!

Health tips | గుండె వ్యాధుల రిస్క్‌ తగ్గాలంటే ఎలాంటి డైట్‌ పాటించాలో తెలుసా..?

Health tips | వానాకాలం ఇన్‌ఫెక్షన్‌లకు గుడ్‌బై చెప్పాలంటే.. మీ డైలీ డైట్‌లో ఈ పండ్లు ఉండాల్సిందే..!

Health tips | అద్భుతమైన ఔషధ లక్షణాలున్న ఈ పునర్నవ ఆకుల గురించి మీకు తెలుసా..?