Health tips | వానాకాలం ఇన్‌ఫెక్షన్‌లకు గుడ్‌బై చెప్పాలంటే.. మీ డైలీ డైట్‌లో ఈ పండ్లు ఉండాల్సిందే..!

Health tips : సాధారణంగా వానాకాలం అనేక వ్యాధులను మోసుకొస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ఇలాంటి అనారోగ్యాలకు చెక్‌ పెట్టాలంటే కొన్ని రకాల పండ్లను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి వానాకాలంలో తినాల్సిన ఆ పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health tips | వానాకాలం ఇన్‌ఫెక్షన్‌లకు గుడ్‌బై చెప్పాలంటే.. మీ డైలీ డైట్‌లో ఈ పండ్లు ఉండాల్సిందే..!

Health tips : సాధారణంగా వానాకాలం (Rainy season) అనేక వ్యాధుల (Diseases) ను మోసుకొస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు (Cold), దగ్గు (Cough) మొదలు డెంగ్యూ జ్వరం (Dengue fever), మలేరియా జ్వరం (Malaria fever), టైఫాయిడ్ (Typhoid) లాంటి విష జ్వరాలు కూడా వానాకాలంలో ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి అనారోగ్యాలకు చెక్‌ పెట్టాలంటే ఈ సీజన్‌లో లభించే కొన్ని రకాల పండ్ల (Fruits) ను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని అంటున్నారు. మరి వానాకాలంలో తినాల్సిన ఆ పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లూ బెర్రీలు

వర్షాకాలంలో ఎదురయ్యే పలు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునేందుకు బ్లూ బెర్రీలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే తక్కువ కేలరీలతోపాటు ఐరన్, ఫొలేట్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు లభిస్తాయని, ఇవి సీజనల్‌ వ్యాధులతో పోరడటానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

లిచీ పండ్లు

వర్షాకాలంలో లిచీ పండును తప్పకుండా తినాలంటున్నారు వైద్యులు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాలను, రోగనిరోధశక్తిని పెంచడానికి సహాపడుతుంది. జలుబు నుంచి ఉపశమనం అందిస్తుంది. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 2011లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం లిచీ పండ్లు తినే వ్యక్తులు జలుబు బారినపడటం చాలా తక్కువగా ఉంటుంది.

పియర్స్

వర్షాకాలంలో అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి చాలా విటమిన్లు మన శరీరానికి అవసరం. అయితే ఈ విటమిన్లు అన్నీ పియర్స్ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా పియర్స్‌ పండ్లను తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌లు సోకే ప్రమాదం ఉండదు.

చెర్రీస్

చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు అంటు వ్యాధులను నివారిస్తాయి. మెదడుకు విశ్రాంతి, ప్రశాంతతను అందిస్తాయి. కాబట్టి వానాకాలంలో తరచూ చెర్రీ పండ్లను ఆహారంగా తీసుకోవాలి.

దానిమ్మ

వర్షాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఈ దానిమ్మ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దగ్గు, జలుబు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

యాపిల్స్

వానాకాలంలో యాపిల్‌ పండు కూడా ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతుంటారు. అందుకు కారణం యాపిల్‌ పండులో ఉండే పోషకాలే. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించడలో సహాయపడతాయి.