Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. కిడ్నీలు ప్రమాదంలో పడ్డాయేమో.. పరీక్షలు చేయించుకోండి..!
Health tips | కిడ్నీల పనితీరు 90% క్షీణించే వరకు లక్షణాలు కనపడకపోవచ్చు. కిడ్నీ పనితీరు బాగా తగ్గిన తర్వాత మాత్రమే లక్షణాలు కనపడతాయి. కిడ్నీ పనితీరు సక్రమంగా లేనప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Health tips : కిడ్నీలు (Kidneys)మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా విసర్జింపజేయడం కిడ్నీల ప్రధానమైన విధి. కిడ్నీల పనితీరు క్షీణించి, శరీరంలోని టాక్సిన్ (Toxins)ల తొలగింపు విధులను సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ వ్యాధులు వస్తాయి. అయితే కిడ్నీల పనితీరు 90% క్షీణించే వరకు లక్షణాలు కనపడకపోవచ్చు. కిడ్నీ పనితీరు బాగా తగ్గిన తర్వాత మాత్రమే లక్షణాలు కనపడతాయి. కిడ్నీ పనితీరు సక్రమంగా లేనప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
లక్షణాలు
కాళ్లు, ముఖం ఉబ్బడం : కిడ్నీలు మలినాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతే శరీరంలో ద్రవం నిల్వలు పేరుకుపోతాయి. దాంతో కాళ్లు, ముఖం శరీరంలోని ఇతర భాగాలు నీరు నిండి ఉబ్బుతాయి.
చిన్నప్పుడే హైబీపీ : చిన్న వయస్సులోనే రక్తపోటు పెరగడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
రాత్రిళ్లు అతిగా యూరిన్ : రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం కూడా కిడ్నీ పనితీరు తగ్గి్ందనడానికి సంకేతంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
యూరిన్‌లో రక్తం : మూత్రంలో రక్తం కనిపించడం లేదా యూరిన్ రంగు కాఫీ రంగులో కనిపించడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతంగా అనుమానించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్వాస సమస్యలు : కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవాల నిల్వలు పేరుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శ్వాస ఇబ్బందిగా మారడం కూడా కిడ్నీ వైఫల్యానికి సంకేతంగా భావించవచ్చు.
అన్నం సహించకపోవడం : కిడ్నీలు సరిగా పని చేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వాంతులు అవుతాయి. అన్నం సహించదు. శరీరంలో దురదలు వస్తాయి.
గమనిక : పై లక్షణాలు కనిపించినంత మాత్రాన కిడ్నీలు వైఫల్యం చెందినట్లు కాదు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సంబంధిత వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. దానివల్ల ఒకవేళ సమస్య ఉంటే మరింత తీవ్రం కాకముందే చికిత్స తీసుకోవచ్చు. సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవడం ద్వారా కిడ్నీల పనితీరును మెరుగుపర్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
Health tips | గుండె వ్యాధుల రిస్క్ తగ్గాలంటే ఎలాంటి డైట్ పాటించాలో తెలుసా..?
Health tips | వానాకాలం ఇన్‌ఫెక్షన్‌లకు గుడ్‌బై చెప్పాలంటే.. మీ డైలీ డైట్‌లో ఈ పండ్లు ఉండాల్సిందే..!
Health tips | అద్భుతమైన ఔషధ లక్షణాలున్న ఈ పునర్నవ ఆకుల గురించి మీకు తెలుసా..?
Health tips | వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే.. వీళ్లు మాత్రం అస్సలు తినొద్దు..!