Weight Loss | ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించి తేలికగా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నూనె, తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే, దీనికి విరుద్ధంగా కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గేందుకు […]
Weight Loss | ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించి తేలికగా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నూనె, తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే, దీనికి విరుద్ధంగా కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గేందుకు కొన్నింటిని చేర్చుకుంటో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి మరి..!
బొప్పాయి రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలుంటాయి. బొప్పాయి తినడం వల్ల బరువు తగ్గుతారు. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతూ వస్తారు. పాలకూరలో పీచు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బరువు తగ్గాలంటే పాలకూరతో సూప్ చేసుకొని తగినా అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. ఈ పాలకూరను డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
పొద్దుతిరుగుడు విత్తనాలతోనూ బరువు తగ్గించుకోవచ్చు. ఈ విత్తనాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతూ వస్తారు. పొద్దు తిరుగుడు విత్తనాలు జీవక్రియను పెంచేందుకు, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.
వోట్స్, రాగులు, మిల్లెట్, బార్లీ వంటి ముతక ధాన్యాల్లో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారంతా తప్పనిసరిగా వీటిని ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.