Milk: ఎండాకాలంలో.. పాలు విరిగిపోకూడదంటే!

Milk:
పాలు విరగడం సాధారణమైన సమస్య. ఎండాకాలంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. మరి పాలు విరగకుండా ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం. పాలు సాధారణంగా 1-2 రోజుల్లో పాడవుతాయి. పాలు వేడి చేయకుండా ఉంచితే బాక్టీరియా పెరిగి పాలు విరిగిపోతాయి.
1. పాలు కాచే ముందు పాత్రను శుభ్రంగా కడగాలి. పాత్ర శుభ్రంగా లేకపోతే పాలు తొందరగా విరిగిపోతాయి.
2. పాలు ఒకసారి కాచితే పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి, పాలను 24 గంటల్లో 3-4 సార్లు కాచాలి.
3. పాలు కాచాక మూత పెట్టకుండా కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆవిరి పూర్తిగా పోయిన తరువాత మూత పెట్టుకోవాలి.
4. పాలు కాగుతున్నప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయి.
5. పాత పాలు కాచుతున్నప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయి.
6. పాలు కాచాక చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. పాలను నీటిలో ఉంచి కూడా చల్లార్చవచ్చు.
7. ఫ్రిజ్‌లో పాలను టమాటా, నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలకు దూరంగా ఉంచాలి