బడ్జెట్ పై చెవుల్లో పువ్వులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
తెలంగాణ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవుల్లో పువ్వులతో అసెంబ్లీలో నిరసన తెలిపారు. బడ్జెట్ మోసం అంటూ నినాదాలతో వాకౌట్ చేశారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగానిని నినాదాలతో అడ్డుతగిలి.. చెవుల్లో పువ్వులతో నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను చింపిపారేసి సభ నుంచి వాకౌట్ చేసి, అసెంబ్లీ ప్రాంగణంతో చెవుల్లో పువ్వులతో నిరసన తెలిపారు. తులం బంగారం మోసం.. మోసం, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు మోసం, మహిళలకు రూ. 2,500 మోసం, వృద్ధులకు రూ. 4,000 ఫించన్ మోసం, 6 నెలల్లో పీఆర్సీ మోసం, బడ్జెట్ మొత్తం మోసం.. మోసం!అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ లు మీడియాతో మాట్లాడారు.
బడ్జెట్ లో స్కీమ్ లను మరిపించారు.. స్కామ్ లకు తెరలేపారు అని, 42 శాతం రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఏటా ఇస్తానన్న రూ.20వేలకోట్ల చొప్పున 60వేల కోట్ల బడ్జెట్ కోసం ఎదురుచూస్తే మోసం చేశారు అని విమర్శించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావిస్తే సమ్మక్క సారక్కకు ఇచ్చే బెల్లాన్ని ఇచ్చి చెవిలో పెద్ద పువ్వు పెట్టారు అన్నారు. బడ్జెట్ లో ప్రభుత్వం డొల్లతనం స్పష్టంగా కనిపించింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం, ద్రోహమేనని, అన్ని వర్గాల ప్రజలకు చెవులో పువ్వులు పెట్టారు తప్ప ఎక్కడా ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు అన్నారు. ఆరు గ్యారెంటీలను మరిచిపోయారు అని, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ప్రస్తావన లేదు అని విమర్శించారు. మహిళలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు అని, ఆసరా పింఛన్ల పెంపు ప్రస్తావన లేదని, రైతు భరోసా గురించి చెప్పకుండా రైతులను దారుణంగా మోసం చేశారు అని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ప్రజలను వంచించారు అని, రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదే హైదరాబాద్ నుంచి అని, హైదరాబాద్ నూతన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి బడ్జెట్‌లో పెట్టలేదు అని వారు విమర్శించారు. హైదరాబాద్‌లో స్కేర్ ఫీట్‌కి 100 నుంచి 200 రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు అని, హైదరాబాద్‌లో విలువైన భూములపై కన్నేశారు. హైదరాబాద్ తాగునీటి సమస్యపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం అని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో హైదరాబాద్‌లో నివసించే జనాభా 50 శాతం పైగా ఉంటుందని చెప్పి, బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేకరించిన ఫార్మా సిటీ భూములను పప్పు బెల్లాల్లా అమ్ముతున్నారు అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
మాది పీపుల్స్ సెంట్రిక్ బడ్జెట్ : భట్టి విక్రమార్క చిట్ చాట్
Rashmika Mandanna | అత్తని ఏడిపించిన రష్మిక మందన్న .. గద్దర్ అవార్డ్స్‌లో ఎమోషనల్ క్షణాలు వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram