TG Assembly | అసెంబ్లీ నుంచి మరోసారి బీఆర్ఎస్ వాకౌట్

పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. హరీశ్ రావు ప్రభుత్వం వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు.

TG Assembly | అసెంబ్లీ నుంచి మరోసారి బీఆర్ఎస్ వాకౌట్

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా విమర్శల దాడి చేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమాశాల నుంచి వాకౌట్ చేసింది. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుండి శనివారం బీఆర్ఎస్ శాసన సభ పక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయింది. ఆయా అంశాలపై సభలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై భరోసా ఇవ్వనందుకు, పోలీసు శాఖలో ఉన్న 17వేల ఖాళీల భర్తీపై సమాధానం చెప్పనందుకు, పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు, బీసీల ఆత్మగౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు, బీసీ సబ్ ప్లాన్ నిదుల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అని ప్రకటించారు. పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా పోలీసు ఉద్యోగుల సమస్యలపై ఇంత నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో పోలీసులను ఎంతో గౌరవించారని, 40,50వేల పోలీసు పోస్టులు భర్తీ చేసారు. కొత్త కమీషనరేట్లు ఏర్పాటు చేసారు. ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేసారు అని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏడు టీఏ బిల్లులు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, పోలీసుల భద్రత పథకాన్ని ఒక లక్షకు మాత్రమే పరిమితం చేశారని హరీశ్ రావు విమర్శించారు. కొత్తగూడెం జిల్లాలో 72టీఏలు పెండింగ్ లో ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో ఇచ్చి కొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టారు అని, లక్షా 30వేల మంది పోలీసుల తరుపున తాను మాట్లాడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. గత సంవత్సరం కంటే 400 కోట్ల బడ్జెట్ ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. పెంచాల్సిన బడ్జెట్ ఎందుకు తగ్గింది? అని, మా ప్రశ్నలకు మంత్రి నుంచి, సీఎం నుంచి ఎలాంటి అష్యూరెన్స్ లేదు అని అందుకే వాకౌట్ చేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Barron Trump | శభాష్…ట్రంప్ కుమారుడికి యూకే జడ్జి ప్రశంస!
Free Biryani | బంపరాఫర్.. గ్యాస్ సిలిండర్ ఇవ్వండి.. నెల రోజులు బిర్యానీ ఫ్రీగా తినండి.. !