ఇంటర్ కాలేజీల ఫేక్ ఎన్ వోసీల వ్యవహారంలో బిగ్ ట్వీస్ట్

హైదరాబాద్‌లో ఇంటర్ కాలేజీల ఫేక్ ఎన్‌వోసీ కేసులో మరో ట్విస్ట్. హైడ్రా కమిషనర్‌తో పాటు ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి 8 కాలేజీలు గుర్తింపు పొందినట్లు వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‍లో ఇంటర్ కాలేజీల ఫేక్ ఎన్ వోసీల వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఇంటర్ బోర్డు గుర్తింపు(అఫిలియేషన్) కోసం 8 ఇంటర్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‍వోసీలు సమర్పించిన సంగతి వెలుగు చూసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపిన వివరాల మేరకు 8 కాలేజీల ఫేక్ ఎన్ వోసీలను గుర్తించారు. ఈ విషయంలో ఆ కాలేజీలపై హైడ్రా ఇప్పటికే కేసులు నమోదు చేసిందని కార్యదర్శి వెల్లడించారు.

హైడ్రా ధ్రువీకరించిన సర్టిఫైడ్ కాపీలకే అనుమతి ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 3,300 కి పైగా కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చాం అని, 150 కాలేజీల అఫీషియల్ మాత్రమే విత్ హెల్ట్ లో ఉన్నాయని తెలిపారు. షార్ట్ ఫాల్స్, పెనాల్టీలు, ల్యాబ్ లు లేని కాలేజీలకు అఫిలియేషన్ నిలిపివేశామని, ఫేక్ ఎన్వోసీలతో గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన కాలేజీలపై కేసులు పెట్టి, తప్పు చేసిన యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే తాజాగా ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ మాత్రమే కాకుండా…ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లుగా వెల్లడవ్వడం మరో సంచలనంగా మారింది. ఫైర్ డిపార్ట్ మెంట్‍లోనాగిరెడ్డి లేకపోయినా ఆయన సంతకాలతో ఎన్‍ఓసీలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణలో మొత్తం 8 కాలేజీలు నాగిరెడ్డి పేరుతో నకిలీ ఎన్ఓసీ తయారు చేసి..ఇంటర్ బోర్డుకు సమర్పించి అనుమతులు పొందినట్లుగా అధికారులు గుర్తించడం కలకలం రేపింది.

Latest News