Revanth reddy : సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐ ఫౌండర్,​ సీఈవో అలెక్స్‌ భేటీ

సీఎం రేవంత్ రెడ్డిని అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు అలెక్స్ భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఆహ్వానం ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ప్రాజెక్టులపై చర్చించారు.

Revanth reddy : సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐ ఫౌండర్,​ సీఈవో అలెక్స్‌ భేటీ

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐ(AI) ఫౌండర్,​ సీఈవో అలెక్స్‌ భేటీ అయ్యారు. డిసెంబర్ 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summi)కు హాజరుకావాలని అలెక్స్ కిప్‌మన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

తెలంగాణ రైజింగ్ విధానం కింద పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా అలెక్స్ బృందానికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో పాటు ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ వ్యవస్థలను అనుసంధాన విధానాలపై వారు చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ రద్దీ, వరదలు, వాతావరణ మార్పు అంచనా వంటి సమస్యలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించడంలో అనలాగ్ అలెక్స్‌ బృందం ఆసక్తిని వ్యక్తం చేసిందని సమాచారం.