‘చిరాన్ ఫోర్ట్ క్లబ్’ భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి

హైదరాబాద్ బేగంపేటలోని 145 ఏళ్ల చారిత్రక చిరాన్ ఫోర్ట్ క్లబ్ భవన కూల్చివేతపై వివాదం చెలరేగింది. నిర్మాణాలను ఆపాలని డిమాండ్.

Chiran Fort Club demolition

విధాత,హైదరాబాద్ : హైదరాబాద్ బేగంపేటలోని 145 ఏళ్ల పురాతన కట్టడమైన ‘చిరాన్ ఫోర్ట్ క్లబ్’కు చెందిన పలు నిర్మాణాల కూల్చివేత ఆపాలని.. పైగా వంశీయుడు ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఆరోపించారు. ఒక నిర్మాణ సంస్థ కార్యాలయానికి స్థలం కల్పించే ఉద్దేశంతో చారిత్రాక భవన భాగాలను కూల్చివేశారని ఒబైద్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు. తెలంగాణలోని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈ భవన యజమాని ప్రేమ్ సాగర్ రావు, ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం ఈ ‘గ్రేడ్ II’ పరిరక్షిత భవనాన్ని కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు.

“చిరాన్ ప్యాలెస్‌లోని తలుపులను తొలగించడం నేను గమనించానని, బహుశా త్వరలోనే ఆ కట్టడాన్ని పూర్తిగా కూల్చివేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆ ప్రాంగణంలో 1980ల నుండి నడుస్తున్న ఒక క్లబ్ ను తాజాగా మూసివేశారని వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే ‘చిరాన్ ఫోర్ట్ క్లబ్’ భవనం తన చారిత్రాక ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

దేశంలోనే తొలి సీ ప్లేన్ ప్రయోగం సక్సెస్
ఎలక్ట్రిక్ వాహనాల రాయితీలో మారుతి కంపెనీ కూడా: మంత్రి పొన్నం

Latest News