Hydra| హెచ్ఎండీఏ భూముల ఆక్రమణపై హైడ్రా చర్యలు

హెచ్ఎండీఏ కు చెందిన భూముల ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మియాపూర్ సర్వేనెంబర్ 100లో భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని హైడ్రా శనివారం కొనసాగించింది.

Hydra| హెచ్ఎండీఏ భూముల ఆక్రమణపై హైడ్రా చర్యలు

విధాత, హైదరాబాద్ : హెచ్ఎండీఏ(HMDA)కు చెందిన భూముల ఆక్రమణల(Land Encroachment)పై హైడ్రా(Hydra) చర్యలు చేపట్టింది. మియాపూర్ సర్వేనెంబర్ 100లో భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని హైడ్రా శనివారం  కొనసాగించింది.  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను విచారించిన హైడ్రా హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించి ఈ భూములను ఆక్రమించినట్లుగా గుర్తించింది. సర్వే నెంబర్ ను మార్చి ఆక్రమిత భూముల్లో భారీగా భవనాలు, అపార్టమెంట్లను నిర్మించారని విచారణలో తేలింది.

దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను హైడ్రా చేపట్టింది. మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, స్థలాలు, పార్కుల ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టిందని హైడ్రా అధికారులు వెల్లడించారు.